సాక్షి,హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటల సమయమే ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
హైదరాబాద్ ఖాజాగూడలో నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. ఈ కూల్చి వేతల్ని వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా నోటీసులు జారీ చేసి బాధితుల వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారు. మీరు కూల్చేసిన నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారు? సంబంధిత ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఆధారాలన్నీ పిటిషనర్ వద్ద ఉన్నాయంటూ హైడ్రా తరుఫు న్యాయవాది బదులు ఇచ్చారు. ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ పరిధి తేల్చకుండా అలా ఎలా కూల్చివేస్తారు. ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోసారి హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని తెలంగాణ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment