
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అయితే, పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.