విజయవాడ, సాక్షి: ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత ఆంధ్రప్రదేశ్ గాని ఎప్పుడైనా ఒక ఏడాదిలో ఒక ఎండాకాలం వచ్చేది, కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రెండో ఎండాకాలం వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులుగా 39 డిగ్రీలు 40 డిగ్రీలు ఎండలు కాస్తున్నాయి. కూటమి మహిమా? సూపర్ సిక్స్‌లో ఇది కూడా ఒక పథకం అంటారేమో అనిపిస్తుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆయన సెటైర్లు వేశారు.
‘‘ ఏపీలో రెండో ఎండాకాలం. కూటమి మహిమా?.. రాష్ట్రం రావణకాష్టంలా మండిపోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా రాజకీయ హత్యలు దాడులు పగ ప్రతీకారంతో కూటమిపాలన సాగిస్తుంది. ప్రతిరోజు పేపర్ చదవాలన్న టీవీలలో, పేపర్లలో సోషల్ మీడియాలో వార్తలు చూడాలన్న ప్రజలకు భయం వేస్తుంది. కూటమి అధికారంలోకొచ్చింది రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం కోసమేనని ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరిన విధంగా కూటమి ప్రభుత్వం ఎసెన్షియాలో మరణించిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన ఉచిత వైద్యం ఘటనపై లోతు అయిన దర్యాప్తు చేపట్టాలి’’ అని అన్నారు.
పేలుళ్లతో కూటమిపాలన ప్రారంభమైందని పోతిన మహేష్ మండిపడ్డారు. ‘‘ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024), ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి, 50 మందికి గాయాలు(21.08.2024), పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి (16.7.2024)’ ఘటనలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగినట్లు తెలిపారు.
1.పేలుళ్లతో ప్రారంభమైన కూటమిపాలన.
A. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024)
B. ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి,50 మందికి గాయాలు(21.08.2024)
C. పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి…— Pothina venkata mahesh (@pvmaheshbza) August 22, 2024
Comments
Please login to add a commentAdd a comment