బీజేపీ భూస్థాపితం కాకతప్పదు
బీజేపీ భూస్థాపితం కాకతప్పదు
Published Sat, Jul 23 2016 9:47 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పోతిన వెంకట మహేష్
గాంధీనగర్ :
రాజ్యసభలో ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకున్న బీజేపీని భూస్థాపితం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటమహేష్ పిలుపునిచ్చారు. లెనిన్‌సెంటర్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా బిల్లును అడ్డుకున్న బీజేపీ భరతం పట్టాలన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్‌తో చేతులు కలిపిన బీజేపీ ప్రత్యేక హోదాకోసం పెట్టిన ప్రైవేటు బిల్లుకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటు బిల్లును ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వని పార్టీలు రానున్న ఎన్నికల్లో మట్టికరచిపోతాయన్నారు. ప్రైవేటు బిల్లు విషయంలో రాజకీయ పార్టీలు అనుసరించిన తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కామరాజు హరీష్, గ్రంథి మహేష్, బత్తుల వెంకటేష్, అప్పలరెడ్డి, గిరీష్, రజాక్, చందు, నూకరాజు, చిన్నా పాల్గొన్నారు.
23విఐసి162– దిష్టిబొమ్మ దహనం చేసు్తన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు
Advertisement
Advertisement