సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్.. జనసేన పెట్టారని కామెంట్స్ చేశారు.
కాగా, పోతిన మహేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఓ ప్యాకేజీ స్టార్. పాలేరు కంటే హీనంగా చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని పవన్ పార్టీ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తన ఆస్తులు కూడబెట్టుకునేందుకే జనసేన పార్టీ పెట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా అని 2014 పవన్ చెప్పాడు. ఒకప్పుడు కార్ ఈఎంఐ కట్టలేనని చెప్పాడు పవన్. ఇప్పుడు 2024 నాటికి 1500 నుండి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తిరగటానికి సొంతంగా హెలిక్యాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలి. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడు. మార్పు కోసం పని చెయ్యాలి అని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులాగా పని చేశారు.
ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఏతేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ 420. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తూ కొత్త పల్లవి ఎత్తాడు. తీసుకుంటున్న సీట్లు ఎన్ని? మార్పు సాధ్యం ఎలా?
పార్టీ పెట్టింది పవన్ ఆస్తులు సంపాదించటానికి.. మాలాంటి వాళ్ళని తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడు. బినామీ నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోసడపు వెంకటేశ్వరరావు పేరుతో కొంత భూమిని రిజిస్ట్రేషన్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ డ్రైవర్ నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా రిజిస్ట్రేషన్‌కు వచ్చాడు.
డాక్యుమెంట్స్‌లో సరైన సైట్ ఫోటో కూడా పెట్టలేదు. డాక్టర్ బాబు బాలాజీ ప్రకాష్‌తో ఈ వ్యవహారం మొత్తం కుడా నడిపారు. ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కొన్నారు. విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. సినిమాలు కూడా తీయలేదు. ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను.
డాక్యుమెంట్స్ అడ్రస్, చెల్లింపులు వేరు వేరు చోట్ల నుండి జరిగాయి. 100 శాతం ఈ ఆస్తి బినామీ పేరుతో పవన్ కొన్నాడు. రంగారెడ్డిలో 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది ఇంకా పెంచుతున్నారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో 14 ఎకరాలు అని పెట్టాడు పవన్. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడు.
పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలు వెల్లడించాలి. చిరంజీవి, రామ్ చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలు చెప్పాలి. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు. 28 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. 48 కోట్లు అప్పులు ఉన్నాయి అని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపాడు. హైదరాబాద్‌లో ఒకప్పుడు జనసేన ఆఫీసు అద్దె భవనం, ఇప్పుడు సొంత భవనం. ఇంకా రిజిస్ట్రేషన్ అవలేదు. వీటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. చంద్రబాబు నుండి తీసుకున్న డబ్బు కాదా?.
పీపుల్స్ మీడియాలో పవన్‌కు వాట ఉంది. రేణు దేశాయ్‌కి ప్రతీ నెల 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాడు. పవన్‌కు మరో ఆఫర్ వచ్చింది. అసెంబ్లీ , పార్లమెంట్ సీట్లు అమ్ముకుంటే 150 కోట్లు వచ్చాయి. చంద్రబాబు చెప్పిన వారికి సీట్లు ఇస్తే ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చారు. ఎంపీ బాలశౌరికి 30 కోట్లు తీసుకుని సీటు ఇచ్చారు. క్యాష్ ఇచ్చే వరకు బాలశౌరికి టికెట్ ప్రకటించలేదు. వీటన్నింటిపై పవన్ స్పష్టత ఇవ్వాలి. పవన్ తీసిన సినిమాలు ఎన్ని వచ్చిన ఆదాయం ఎంత?.
రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్న పవన్ సామాన్య మధ్య తరగతికి చెందిన వాడు ఎలా అవుతాడు?. చెవిలో పువ్వులు పెడుతున్నాడు. పవన్ ఒక చీడ పురుగు. నాడు చిరంజీవి మోసం చేసి ఇంటికి వెళ్లాడు. నేడు పవన్ మళ్లీ వచ్చాడు. మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడమే వీరిద్దరి పని’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment