‘కాపులను పవన్ కల్యాణ్‌ ఎదగనీయటం లేదు’ | pothina mahesh fires on chandrababu and pawan kalyan | Sakshi
Sakshi News home page

‘కాపులను పవన్ కల్యాణ్‌ ఎదగనీయటం లేదు’

Published Mon, Apr 29 2024 4:21 PM | Last Updated on Mon, Apr 29 2024 4:21 PM

pothina mahesh fires on chandrababu and pawan kalyan

సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో  మాట్లాడారు.

‘‘చెప్పింది చేసి చూపించిన  గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్‌. సీఎం జగన్‌.. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్‌. పేదల పట్ల సీఎం జగన్‌కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం​ లేదు.  పారిశ్రామికవేత్తలకు దోచిపెట్డడానికే బాబుకు అధికారం కావాలి.

..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలూ చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకుని ఓటెయ్యమని అడుగుతున్న నేత జగన్.  ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్‌పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్‌.. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి, పేదలకు ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారు.  చంద్రబాబు, పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఎందుకు చెప్పటం లేదు?. సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది.

...నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలపై చర్చకు మేము సిద్ధం. దీనిపై చర్చించేందుకు టీడీపీ కూటమికి ధైర్యం ఉందా?.  అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాపులకు మేలు చేసినదే వైఎస్ జగన్. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు?.

..చంద్రబాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు?. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? హరిరామజోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?.  పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మినెంట్‌గా ఉండదు. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే.

..2019 తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు?. వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా?. లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లారో పవన్ సమాధానం చెప్పాలి. పవన్‌కు ఎప్పుడూ సేవలు చేసిన అంజిబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి?’’ అని పోతిన మహేష్‌  ధ్వజమెత్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement