
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): భార్యపై తనకున్న అపార ప్రేమను ఓ భర్త వినూత్నంగా చాటుకున్నాడు. 40 ఏళ్ల వైవాహిక జీవితంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన భార్య భౌతికంగా దూరమైపోయినా.. ఆమె ప్రతిమతో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నాడు. విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు భార్య కాశీ అన్నపూర్ణ గతేడాది అనారోగ్యంతో మరణించారు.
దీంతో కుంగిపోయిన కుటుంబరావు.. ఆమెనే తలుచుకుంటూ జీవించేవారు. ఆమె ఎల్లప్పుడూ తనతోనే ఉండాలనే కోరికతో ఏకంగా భార్య ప్రతిమను తయారు చేయించి.. ఇంట్లో పెట్టుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో కాశీ అన్నపూర్ణ ప్రతిమతో కలిసి కుటుంబరావు కేక్ కట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment