
టీడీపీ-జనసేన ముసుగు రాజకీయాలు చేస్తున్నాయని...
సాక్షి, కృష్ణా : జనసేన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే డీవై దాసు ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం జనసేన పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీనుంచి పోటీ చేయాలని జనసేన నేతలు ఆహ్వానించారని, జనసేనలో చేరిన తర్వాత బీఎస్పీనుంచి పోటీ చేయాలని సూచించారని తెలిపారు. పామర్రు టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం తనను బలిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన ముసుగు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బీ-ఫాం ఇస్తానని 13గంటల పాటు జనసేన ఆఫీసు వద్ద నీరక్షణ చేయించారని, ఆ తర్వాత బీఎస్పీ ఎంపీని కలవాలంటూ నాదెండ్ల మనోహర్ సూచించారని తెలిపారు. టీడీపీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీని ఓడించటానికి రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.