
సాక్షి, కృష్ణా జిల్లా : గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి పసుపు రంగేసిన ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు అక్రమంగా సచివాలయంలోకి చొరబడి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పెట్టారు. ఇలా బరితెగించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ మేరకు పంచాయితీ సెక్రటరీ విజయ వర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్‌కు తరలించినట్టు గంపలగూడెం ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment