
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ఉదయం వైఎస్‌ఆర్ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అంబాపురం, జక్కంపూడి మీదుగా కొత్తూరు తాడేపల్లి చేరుకుంటారు. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది.
ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్ చేరుకొని పాదయాత్ర ముగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగే పల్లె మార్గాల్లో సందడి వాతావరణం నెలకొంది.