
సాక్షి, మచిలీపట్నం : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 152వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం జననేత వైఎస్ జగన్ మచిలీపట్నం నియోజవకర్గం పొట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపూడి క్రాస్ రోడ్డు మీదుగా బుద్దాల పాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా వైఎస్ జగన్‌కు ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1937.1 కిలోమీటర్లు నడిచారు.