
సాక్షి, మచిలీపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 151వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన మచిలీపట్నం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చిలకలపుడి, సర్కార్‌నగర్, శ్రీనివాస నగర్, పోతిరెడ్డి పాలెం మీదుగా పొట్లపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు కృష్ణా జిల్లాలో భారీగా స్పందన వస్తోంది. జననేతను కలుసుకునేందుకు ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుండా వస్తున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.