
సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. 146వ రోజు గురువారం ఉదయం గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం వెంటకరామపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
అక్కడ నుంచి ఇందుపల్లి మీదుగా నందమూరు క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర సాగుతున్న పల్లెల్లో వైఎస్ జగన్ రాకతో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ రాక సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు బ్యానర్లు కట్టి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.