
సాక్షి, కృష్ణా జిల్లా : విజవాడ జాతీయ రహదారిపై లారీ- మహేంద్ర ట్రావెల్ కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరువూరు శివారు వద్ద చోటుచేసుకుంది. కారు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. 108కు ఫోన్ చేసినప్పటికి అంబులెన్స్ జాడకానరాలేదు. దీంతో వారిని ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో విజయవాడకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment