సాక్షి, కృష్ణా జిల్లా: వర్షాలు పడుతుండడంతో పాములు రెచ్చిపోతున్నాయి. జిల్లాలోని మొవ్వ మండలంలో పాము కాట్లు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే ఐదుగురు పాము కాటుకు గురయ్యారు. గత మూడు రోజులుగా చూస్తే మొత్తం 26 మంది పాము కాటుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లను అదనంగా నిల్వ చేసింది. దీంతో బాధితులు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. పాములు కాటేసిన వెంటనే ఆలస్యం చేయకుండా బాధితులను ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాపాయ నుంచి కాపాడతామని డాక్టర్ శొంఠి శివరామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment