
ప్రతీకాత్మక చిత్రం
కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామానికి చెందిన మాతంగి ప్రశాంతి 108 వాహనంలో ప్రసవించింది. ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉండటంతో నందిగామ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రశాంతిని 108 వాహనంలో తరలిస్తుండగా గుంటుపల్లి సమీపంలో 108 వాహనంలోనే ప్రసవించింది.
పురిటినొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న ప్రశాంతికి 108 సిబ్బంది సహాయం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డను తర్వాత విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నందిగామ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకంపై ప్రశాంతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment