ఘంటసాలలో పంపిణీకి సిద్ధంగా సైకిళ్లు
సాక్షి, ఘంటసాల : ఎన్నికల నిబంధనలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ మాకేం పట్టిందంటూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ను పాటించాల్సిన అధికారులు మాత్రం కేవలం తమ కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. మండల కేంద్రమైన ఘంటసాల హైస్కూల్‌లో విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సైకిళ్లను సిద్ధం చేస్తున్నారు. మండలంలో 8, 9 తరగతులు చదువుతున్న 212 మందికి పంపిణీ చేసేందుకు కొత్త సైకిళ్లను ఇటీవల తీసుకువచ్చారు. స్కూల్‌లోనే రహస్యంగా పార్టులు అమర్చుతున్నారు. స్థానిక హైస్కూల్ వద్ద సైకిళ్లు బిగించే విషయమై ఎంఈఓ బీహెచ్‌సీ సుబ్బారావును సాక్షి వివరణ కోరగా సైకిళ్ల పంపిణీ విషయంలో తమకు సంబంధం లేదని, సంబంధిత కాంట్రాక్టర్‌కు షెల్టర్ కల్పించడం వరకే తమ పని అని మండలంలోని అన్ని హైస్కూల్స్‌కు సంబంధిత కాంట్రాక్టరే సైకిళ్లు పంపిణీ చేస్తాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment