Neglect of officers
-
‘రియల్’ మాయ
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి) : మండల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. అయినా సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదో తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి మమ అనిపిస్తున్నారు. వీటిని అదుపు చేయడానికి పటిష్ట ప్రణాళిక చేపట్టకపోవడంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా అక్రమ వెంచర్లను కట్టడి చేయడానికి హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో మినహా మిగతా వాటిల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇటీవల ఆదేశాలు సైతం జారీ చేసింది. ఆ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో మళ్లీ యధావిధిగా అక్రమ వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూ మూడు ప్లాట్లు, ఆరు వెంచర్లుగా లాభాలు ఆర్జిస్తున్నారు. జోన్లతో సమస్య.... కందుకూరు మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటంతో పాటు అధిక ప్రాంతాలు కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి సాధ్యం కాదు. దీంతో పాత తేదీల్లో అనుమతులు తీసుకుని జీపీ లేఅవుట్లకు తెరలేపారు. రహదారులు, డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా, పార్కు స్థలం వంటివి వదలకుండానే ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వం హెచ్ఎండీఏ, డీటీసీపీ మినహా మిగతా లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీచేసినా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గతంలో 2015 ఆగస్టు నెల వరకు కటాఫ్ తేదీ నిర్ణయించి ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. ఆ తేదీ ముందు రిజిస్ట్రేషన్లు అయి ఉన్న ప్లాట్లను కొనుగోలు చేస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత చేసిన వెంచర్లలో కొనుగోలు చేస్తే అక్రమంగానే నిర్ధారిస్తారు అధికారులు. ఫాంల్యాండ్ పేరుతో.... కాగా లేఅవుట్లు చేస్తే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడం, కూల్చివేతలు చేపట్టడంతో ఫాం ల్యాండ్ పేరుతో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంల్యాండ్ లేఅవుట్‌కు ఎవరి నుంచి అనుమతి అవసరం లేకపోవడంతో చాలా గ్రామాల పరిధిలో ప్రస్తుతం ఇవే తరహా లేఅవుట్లు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు. ఫాంల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేసినా రహదారులు వంటి వాటిని అభివృద్ధి చేయకూడదు. కాని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి అందంగా తీర్చిదిద్ది ఫాంల్యాండ్ వెంచర్లలో గుంటలుగా విభజించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు... కాగా హెచ్ఎండీఏ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి కూల్చివేతలు చేసి మమ అనిపిస్తున్నారు. పటిష్టంగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, హెచ్ఎండీఏ శాఖలు సమన్వయంతో అక్రమ లేఅవుట్లను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
కోడ్‌కు అడ్డంగా సవారీ
సాక్షి, ఘంటసాల : ఎన్నికల నిబంధనలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ మాకేం పట్టిందంటూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ను పాటించాల్సిన అధికారులు మాత్రం కేవలం తమ కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. మండల కేంద్రమైన ఘంటసాల హైస్కూల్లో విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సైకిళ్లను సిద్ధం చేస్తున్నారు. మండలంలో 8, 9 తరగతులు చదువుతున్న 212 మందికి పంపిణీ చేసేందుకు కొత్త సైకిళ్లను ఇటీవల తీసుకువచ్చారు. స్కూల్లోనే రహస్యంగా పార్టులు అమర్చుతున్నారు. స్థానిక హైస్కూల్ వద్ద సైకిళ్లు బిగించే విషయమై ఎంఈఓ బీహెచ్‌సీ సుబ్బారావును సాక్షి వివరణ కోరగా సైకిళ్ల పంపిణీ విషయంలో తమకు సంబంధం లేదని, సంబంధిత కాంట్రాక్టర్‌కు షెల్టర్ కల్పించడం వరకే తమ పని అని మండలంలోని అన్ని హైస్కూల్స్‌కు సంబంధిత కాంట్రాక్టరే సైకిళ్లు పంపిణీ చేస్తాడని చెప్పారు. -
పారుతున్నది కాలువ కాదు... సాగర్ నీరు
సాక్షి, తోకపల్లె (పెద్దారవీడు): మండలంలో తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే ఉన్న సాగర్ ఎయిర్‌వాల్ లీకుతో నీరంతా వృథాగా పోతుంది. ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం ద్వారా త్రిపురాంతకం మండలం దుపాడు చెరువు నుంచి తోకపల్లె, గొబ్బూరు, దేవరాజుగట్టు మీదుగా పెద్దసైజు నీటి పైపుల ద్వారా మార్కాపురం పట్టణానికి నీరు సరఫరా చేస్తున్నారు. అమరావతి– అనంతపురం జాతీయ రహదారిలోని తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి వద్ద పైపు ఎయిర్ వాల్ లీక్ కావడంతో పొలాల మీదుగా సాగర్ నీరంతా వృథాగా తీగలేరు కాలువలోకి వెళ్తున్నాయి. వేసవి కోసం పొదుపుగా నీటిని వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎయిర్‌వాల్ లీకేజితో నీరంతా రోజూ కొన్ని వేల లీటర్ల నీరు నేలపావుతోంది. ఎయిర్‌వాల్ లీకేజి గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వదిలిన సమయంలో తీగలేరులోకి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అసలే వేసవి కాలంలో ప్రజలు, పశువులు తాగునీటితో అల్లాడిపోతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అడుగడుగునా.. అమ్మకాల్లో దగా!
‘ఇందుగలడందు లేడని సందేహం వలదు... ఎందెందు వెదకి చూసినా... అందందేగలదు’ అన్నట్టు జిల్లాలో ఎక్కడ చూసినా తూనికలు... కొలతల్లో దగా... మోసం... కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న కిరాణా కొట్టు మొదలు... పెద్ద పెద్ద బంగారు దుకాణాల వరకూ తూనికల్లో మోసాలకు పాల్పడుతున్నాయి. పాలనుంచి పెట్రోల్ వరకూ కొలతల్లో దగా చేస్తున్నారు. దీనివల్ల సగటు వినియోగదారుడు నిరంతరం మోసపోతూనే ఉన్నాడు. వీటిని నియంత్రించగల వ్యాపారులు చేష్టలుడిగి చూస్తున్నారు. లేనిపోని సాకులు చెబుతూ నామమాత్రంగా దాడులకు చేసి చేతులు దులుపుకుంటున్నారు. విజయనగరం పూల్‌బాగ్ : వ్యాపారుల్లో అత్యాశ పెరిగిపోతోంది. చిన్న కిరాణా కొట్టు మొదలుకుని బంగారుషాపు వరకు ఎక్కడికి వెళ్లినా వినియోగదారుడిని మోసం చేస్తున్నారు. చివరకు రేషన్‌డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దుకాణా ల్లో వేసిన తూకం... ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణం, వస్త్ర దుకాణాలు, ప్యాన్సీ, హార్డ్‌వేర్, బంగారు షాపులు, ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 24,301 వరకూ ఉన్నాయి. చిరువ్యాపారులను కలుపుకుంటే 50 వేలమందికి పైగానే ఉంటారు. ఆయా దుకాణాల్లో ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో విక్రయిస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలు ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు– కొలతల శాఖ నిబంధనల ప్రకారం వ్యాపారి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి. కాటాలో తేడాలు వస్తే రిపేరర్ వద్దకు వెళ్లి సరిచేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవటం లేదు. తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడుగడుగునా దగా... జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కూరగాయలు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. సైకిళ్లపైన రోడ్డుకు ఇరుపక్కలా బళ్లపై నిత్యం వ్యాపారం సాగుతుంది. ఎలక్ట్రికల్ కాటాలతో సైతం వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. ముందుగా వంద గ్రాములు తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేజీకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకే అధిక శాతం దుకాణాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. గ్యాస్‌లోనూ చేతివాటం వంటగ్యాస్ సిలండర్ తూకంలోను వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. సిలిండర్లను తూకం వేయకుండానే అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండునెలలకు రావాల్సిన సిలిండరు కేవలం 40 రోజులకే అయిపోతుందని గృహిణులు గగ్గోలు పెడుతున్నా రు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బంకుల్లో మాయాజాలం పెట్రోలు బంకుల్లో కూడా మోసం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇంధనాన్ని నింపే సమయంలో వినియోగదారుడు జీరో రీడింగ్ చూసుకోకుంటే సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇచ్చిన నగదుకు సరిపడా ఇంధనం కొట్టించకపోవటంతో వాహనదారులు నిత్యం నష్టపోతున్నారు. మరిన్ని బంకుల్లో సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు కొరఢా ఝుళిపించాల్సిన అవసరం ఉంది. చేపలు, మాంసం దుకాణాల్లో.. ముఖ్యంగా చేపలు, మాం సం దుకాణాల్లో ఎక్కువగా కాటాల్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా సిబ్బంది రావటం లేదు. కూరగాయల మార్కెట్లో తూకాలు సరిగ్గా ఉండవు. చాలామంది రాళ్లనుకూడా ఉపయోగిస్తున్నారు. – కొవ్వాడ నాగరాజు, నెల్లిమర్ల సిబ్బంది కొరత వేధిస్తోంది ప్రస్తుతం జిల్లాలో సిబ్బం ది కొరత ఉంది. జిల్లా సహాయ నియంత్రికులు–1, బొబ్బిలి–1, విజ యనగరం–1 ఇన్స్పెక్టరు ఉన్నారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటు–1, ఆఫీస్ సబార్డినేట్–1, చౌకీదార్–1 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇప్పటివరకూ మెరుగైన ఫలితాలు సాధించాం. ఆ పోస్టులు భర్తీ అయితే దాడులు ముమ్మరం చేసి, మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. – జి.రాజేష్‌కుమార్, ఉపనియంత్రికులు, విజయనగరం. -
మోగని పెళ్లి బాజాలు
పోలవరం : ప్రభుత్వ నిబంధనలు, అధికారుల నిర్లక్ష్యం పోలవరం ముంపు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారాయి. పోలవరం పునరావాస చట్టంలో లేని కొన్ని నిబంధనలను ఓ ఉన్నతాధికారి అమలు చేయడం, దీనికి ప్రభుత్వం వత్తాసు పలకడంతో ముంపు గ్రామాల్లో యువతుల వివాహాలు నిలిచిపోయాయి. ఏడాదిగా ముంపు గ్రామాల్లో పెళ్లిబాజాలు మోగడం లేదు. ఎప్పటివరకు ఈ పరిస్థితి ఉంటుందో తెలియక, యువతుల వివాహ వయస్సు దాటిపోతుండటంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆందోళన ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలోని 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 89 గ్రామాలు, వేలేరుపాడు మండలంలోని 60 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ అమలు చేసేందుకు పోలవరం మండలంలోని ముంపు గ్రామాల్లో అధికారులు 2017 జూన్ 30వ తేదీని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. గతంలో చేసిన సోషియో ఎకనమిక్ సర్వే(ఎస్ఈఎస్ డేటా)లో పేర్లు ఉన్నప్పటికీ, కట్ ఆఫ్ డేట్ నాటికి 18 ఏళ్లు నిండిన, వివాహం కాని యువతులకు మాత్రమే పునరావాస ప్యాకేజ్ అందిస్తామని అధికారులు గ్రామసభలో వెల్లడించారు. ముందుగా డేటాలో పేరు ఉంటే వివాహమైనా ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన అధికారులు గ్రామసభలో మాట మర్చారు. వివాహమైనా ప్యాకేజ్ వస్తుందని ముందు చెప్పడంతో అప్పట్లో యువతుల వివాహాలు చేశారు. ఆతరువాత మాటమార్చిన అధికారులు డేటాలో ఉన్న వివాహమైన దాదాపు 500 మంది యువతుల పేర్లను తొలగించారు. వివాహమైతే ప్యాకేజీ రాదన్న నిబంధనతో దాదాపు 450 మంది యువతుల వివాహాలు ఏడాదిగా నిలిచిపోయాయి. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇదిలా ఉంటే ఎప్పుడు గ్రామాలు ఖాళీ చేయిస్తారో, ఎప్పుడు ప్యాకేజ్ అమలు చేస్తారో తెలియక, ప్యాకేజ్ వదులుకుని వివాహాలు చేయలేక యువతుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 2016 జూన్‌లో సోషియో ఎకనమిక్ సర్వే చేశారు. అప్పటికి 18 ఏళ్లు నిండిన యువతులకు మాత్రమే ప్యాకేజ్ ఇస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటికే వివాహమైన వారికి గాని, కట్ ఆఫ్ డేట్ తరువాత 18 ఏళ్లు నిండిన వారికి గాని ప్యాకేజ్ వర్తించదని స్పష్టం చేశారు. ఈవిధంగా దాదాపు 2 వేల మంది యువతులకు ప్యాకేజీ వర్తించే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయకుండా, గ్రామాలు ఖాళీ చేయించకుండా కట్ ఆఫ్ డేట్ నిర్ణయించటంపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయోమయంలో ఉన్నాం నాకు ఇద్దరమ్మాయిలు. పెద్ద అమ్మాయి వయసు 24 ఏళ్లు. వివాహం అయితే పునరా వాస ప్యాకేజ్ రాదని చెప్పడంతో చేయలేదు. ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారో, వివాహం ఎప్పుడు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాం. – జలగం కన్నయ్య, తల్లవరం నాకు ముగ్గురు కుమార్తెలు నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త లేరు. పెద్దమ్మాయి వయస్సు 25 ఏళ్లు. వివాహమైతే ప్యాకేజ్ రాదని చెప్పారు. దీంతో ఇంకా వివాహం చేయలేదు. ఎప్పుడు ప్యాకేజ్ ఇస్తారో తెలియడం లేదు. – మాడే అక్కమ్మ, తల్లవరం పేరు తొలగించారు నాకు ఇద్దరు అమ్మాయిలు. గతంలో చేసిన డేటాలో పేరు ఉందని పెద్దమ్మాయి వివాహం చేశాను. ఇప్పుడు డేటా నుంచి పేరు తొలగించి ప్యాకేజీ రాదని చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం. – మడకం సింగారమ్మ, ములగలగూడెం వివాహం ఆపేశాం నాకు ఒక అమ్మాయి. వయస్సు 20 ఏళ్లు. పెళ్లి సంబంధం కుదిరింది. వివా హమైతే ప్యాకేజ్ ఇవ్వనంటున్నారు. దాంతో వివాహం ఆపేశాం. ప్యాకేజ్ వస్తుందని లాంఛనాలు కూడా ఎక్కువ అడుగుతున్నారు. – మడకం నాగమణి, గాజులగొంది -
ఇసుకాసురులు
పగటి వేళ కొంతైనా కంట్రోల్లో ఉంటున్న ఇసుక ఓవర్ లోడు దందా.. రాత్రివేళలో విచ్చలవిడిగా సాగుతోంది. ఈ దందాకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు తమ మౌనంతో వత్తాసు పలుకుతుండడం గమనార్హం. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది కాంట్రాక్టర్లు ఒక్క పర్మిట్ కాగితం పైన రెండు ట్రిప్పుల లారీల అధిక లోడును తీసుకుపోతున్నారు. అయినా ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : గోదావరి తీరంలో ఇసుక తోడేళ్ల రాజ్యం నడుస్తోంది. అందిన కాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన ఆదాయాన్ని తమ ఖజానాలో ఎంచక్కా జమ చేసుకుంటున్నాయి. కళ్ల ముందే అక్రమ దందా కనిపిస్తున్నప్పటికీ సంబంధిత టీఎస్ఎండీసీ, పోలీసు, రవాణా, రెవెన్యూ తదితర ప్రభుత్వ విభాగాలు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుం డడంతో ఇసుక అక్రమ రవాణా ‘మూడు లారీలు.. ఆరు అదనపు బకెట్లు’గా విలసిల్లుతోంది. నిబంధనలకు తూట్లు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవాపూర్ మండలం కాళేశ్వరం బ్యారేజీ పనుల వేదికగా సాగుతున్న ఇసుక దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ముంపు ప్రాంతంలో ఇసుక తరలింపు పేరుతో క్వారీలు దక్కిం చుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. గోదావరిలో అందినకాడికి ఇసుకను తోడేస్తూ కోట్లు కూడబెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బ్యాక్ వాటర్ నిల్వ ఉండేందుకు క్వారీలకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా మహదేవాపూర్, కాటారం మండలాల్లో మొత్తం 22 క్వారీలకు పర్మిషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఆయా మండలాల్లో 18 క్వారీల్లో ఇసుక అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్వారీల నుంచి 22 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలు నిత్యం సగటున రెండు వేల వరకు వరంగల్, హైదరాబాద్ నగరాలకు ఇసుకను తరలిస్తున్నాయి. వీటిలో ప్రతీ లారీలో కనీసం ఐదు టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా కాంట్రాక్టర్ల ఖాతాలోకి వెళ్తొంది. ముఖ్యంగా అన్నారం బ్యారేజీ పరిధిలో తాళ్లగడ్డ 1, 2, పలుగుల 1, 2, మహదేవాపూర్ 3, 4, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, పూస్కుపల్లి, కాటారం మండలంలోని దామెరకుంట 1, 2 క్వారీల్లో అధికలోడు దందా ఇష్టారాజ్యాంగా నడుస్తోంది. కాగా, ఈ దందాను టీఎస్ఎండీసీ అ«ధికారులు, కాంట్రాక్టర్లు దగ్గరుండి మరీ నడిపిస్తున్నట్లు సమాచారం. క్వారీ దగ్గర టీఎస్ఎండీసీ సిబ్బంది రూ. 200 నుంచి రూ. 300 వరకు లారీల డ్రైవర్ల వద్ద అక్రమంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వే బ్రిడ్జిలే కీలకం.. ఇసుక అక్రమ తరలింపులో వేబ్రిడ్జిలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇసుకను తక్కువ తూకం వేస్తూ నిర్వాహకులు తప్పుడు కాగితాలు ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ లోడు ఉన్నా తక్కువగా ఉన్నట్లుగా వేబిల్లులు జారీ చేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా వేబ్రిడ్జిల వద్ద లారీల లోడును తూకం వేసేందుకు రూ.100 నుంచి రూ. 500 వరకు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఆయా చోట్ల మామూళ్ల వ్యవహారం జోరుగా సాగుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక నగరాలకు తరలిపోతుంది. దీన్ని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీసుశాఖ అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేస్తూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. -
సుప్తవర్ణం
►వారం క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలపై వారంలో రోజుకో రంగు బార్డర్లున్నవి మార్చాలి ►రెండు రోజులైనా మార్చని వైనం ►గాడితప్పిన ప్రభుత్వ వినూత్న కార్యక్రమం ►పట్టించుకోని ఆస్పత్రుల ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం గాడితప్పుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. వారంలో రోజుకో రంగు బార్డర్లు ఉన్న దుప్పట్లను క్రమం తప్పకుండా రోగుల పడకలపై మార్చాలి. జిల్లాలో అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ఆస్పత్రుల్లో కూడా ఈ కార్యక్రమం అటకెక్కింది. రెండు రోజులకోసారి కూడా దుప్పట్లను మార్చడం లేదు. తిరుపతి (అలిపిరి): స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. ముఖ్య మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులు గడవక ముందే స్వచ్ఛత కనుమరుగవుతోంది. రోజుకో రంగు ఉన్న బార్డర్లతో ఏడు రోజు లు వేర్వేరు దుప్పట్లు మార్చే కార్యక్రమాన్ని మే 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరీ దుప్పట్లు మార్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సీఎం ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో పాటు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అ«ధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సూచించిన వారం రోజులలోపే స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం అభాసుపాలైంది. వైద్యుల నిక్ష్యం కారణంగా తిరుపతిలోని రుయా, స్విమ్స్, ప్రసూతి ఆసుపత్రి మొదలు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలకు నోచుకోవడం లేదు. రెండు రోజులైనా ఒక రంగు బార్డర్ ఉన్న దుప్పట్లే ఆసుపత్రుల్లో దర్శనమిస్తున్నాయి. అవగాహన బోర్డులు ఎక్కడ? ఆసుపత్రుల్లోని వార్డుల్లో రోజువారి మార్పుచేసే దుప్పట్ల రంగుల వివరాలు తెపిపే అవగాహన బోర్డులు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం ప్రారంభం రోజున జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రంగులను తెలిపే బ్యానర్లను గోడలకు అంటించారు. కార్యక్రమం అయిన తరువాత వాటిని అక్కడి నుంచి తొలగించారు. శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ఆస్పత్రిలో దుప్పట్ల మార్పు కార్యక్రమం అమలు కావడం లేదు. ఏ రోజు ఏ రంగు దుప్పటి వేస్తారో అక్కడి సిబ్బందికే అర్థం కావడం లేదు. స్విమ్స్‌లోనూ ఈ కార్యక్రమం పేలవంగా అమలవుతోంది. ఇక ప్రసూతి ఆస్పత్రిలో స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమం ఒకటుందా అన్నవిధంగా కార్యక్రమం సాగడం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రం, నిత్యం వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే తిరుపతిలోనే వినూత్న కార్యక్రమం ఇలా అమలవుతుంటే ఇక జిల్లావ్యాప్తంగా ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అధికారులు పర్యవేక్షణ లోపం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఆస్పత్రులకు స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయినా ఆస్పత్రుల ఉన్నతాధికారులు వార్డుల్లో పర్యవేక్షణ లోపం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. ఇకనైన ఆసుప్రతుల ఉన్నాధికారులు స్వచ్ఛత కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేసి రోగులకు మెరుగైన సదుపాయలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవీ నిబంధనలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకో రంగు బార్డర్ ఉన్న దుప్పట్లను క్రమం తప్పకుండా రోగుల బెడ్లపై మార్చాలి. ఏ రోజు దుప్పటి మార్చకపోయినా రోగులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించవచ్చు. నేరుగా ఆస్పత్రి కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కార్యక్రమం ఇండియన్ రైల్వే మార్గదర్శకాలను అనుసరించి అమలుచేస్తున్నారు. సోమవారం ఊదా, మంగళవారం ఆరెంజ్, బుధవారం మెజెంతా, గురువారం ఆకుపచ్చ, శుక్రవారం ఇటుక రంగు, శనివారం నీలిరంగు, ఆదివారం పసుపు రంగు బార్డర్లు ఉన్న దుప్పట్లు తప్పనిసరిగా మార్చాలి. రోగులకు పడకల ద్వారా ఎటువంటి వైరస్లు.. బ్యాక్టీరియాలు సోకకుండా రోగి మరింత అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకే దుప్పట్ల మార్పు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. -
8 గంటలు.. 100 కి.మీ
‘కల్వకుర్తి’ కాలువ పనులను పరిశీలించిన హరీశ్‌రావు పనుల జాప్యం.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం సాక్షి, నాగర్‌కర్నూల్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం రోజంతా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువ పనులను పరిశీలించారు. ఏకంగా 8 గంటల పాటు ఆయన కాలువల వెంబడి తిరిగారు. పనులతీరు, నాణ్యతను పరిశీ లించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డిగూడ నుంచి.. నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి గట్టు వరకు ఆయన పరిశీలన జరిగింది. వంద కిలోమీటర్ల మేర కాలువల స్థితిగతులను పరిశీలించారు. గ్రామస్తుల సమస్యలు వింటూ ముందుకు సాగారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ 160 కి.మీ.మేర విస్తరించి ఉంది. కాలువల వెంట పర్యటించిన ఆయనకు ఆక్వాటెక్ బ్రిడ్జి నిర్మాణాలు, యూటీలు, డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి, ఓటీల పనులు పెండింగ్‌లో ఉండటం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులకు నీరెలా అందిస్తామని ప్రశ్నించారు. జూలై చివరి నాటికి చివరి ఆయకట్టుకు నీరందించాలని నీటి పారుదల సీఈ ఖగేందర్‌ను ఆదేశించారు. గుడిపల్లిగట్టు వద్ద కల్వకుర్తి, అచ్చం పేట నియోజకవర్గాలకు సాగునీరు అం దించడంపై ఉన్నతా ధికారులతో సమీ క్షించారు. 2 నెలల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసి సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏడాదిలోనే ఆర్డీఎస్ కాలువల్లో తుమ్మిళ్ల నీళ్లు సాక్షి, గద్వాల: ఈ ఏడాదిలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల ను పూర్తిచేసి ఆర్డీఎస్ కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాలలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడా రు. ఆర్డీఎస్ సమస్య శాశ్వత పరిష్కారానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతోపాటు 3 రిజర్వాయర్లు నిర్మి స్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం 2 లక్షల 13 వేల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసిందని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వని కంపెనీలపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు.