విజయవాడ బస్‌స్టేషన్‌లో మూవీ థియేటర్లు | Movie Theaters in Vijayawada bus station | Sakshi
Sakshi News home page

విజయవాడ బస్‌స్టేషన్‌లో మూవీ థియేటర్లు

Published Sun, Nov 1 2015 8:15 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Movie Theaters in  Vijayawada bus station

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సంక్రాంతి నుంచి ప్రయాణికులకు వెండితెరలు అందుబాటులోకి రానున్నాయి!. స్టేషన్‌లోకి బస్సులు వచ్చే ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్‌లో రెండు డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో థియేటర్‌లో 134 సీట్లు ఉంటాయి. రూ.1.3 కోట్లతో చేపట్టిన మినీ డిజిటల్ థియేటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. గడువులోగా నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. టిక్కెట్ ధర రూ.80గా నిర్ణయించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement