ఇసుక సమస్యకు కాల్‌ సెంటర్‌ : కలెక్టర్‌ | Call Center for Sand Problem: Krishna District Collector | Sakshi

ఇసుక సమస్యకు కాల్‌ సెంటర్‌ : కలెక్టర్‌

Nov 10 2019 1:21 PM | Updated on Feb 17 2020 5:11 PM

Call Center for Sand Problem: Krishna District Collector - Sakshi

సాక్షి, విజయవాడ : ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆదివారం వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగా కాల్ సెంటర్‌ ఏర్పాటు చేశామని 0866 2474801, 803, 804 నంర్లకు ఫోన్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయిస్తుండగా ప్రస్తుతం 18200 టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. మొత్తంగా ఐదు రీచ్‌లు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయని, 38 మంది పట్టా ల్యాండ్‌ ఓనర్లు తవ్వకాలకు తమ సుముఖత వ్యక్తం చేశారని తెలపారు. మరోవైపు శనివారం జిల్లాలోని అన్ని రెవెన్యూ కేంద్రాలలో రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. 

ఇదిలా ఉండగా, సోమవారం మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జన్మదినం సందర్భంగా ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఉర్దూలో పాండిత్యం ఉన్న నలుగురికి జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. అబుల్‌ కలాం ఆజాద్‌ పేరున జాతీయ పురస్కారం, అబ్దుల్‌ కలాం పేరుతో విద్యా పురస్కారం అందజేస్తామని వివరించారు. మంత్రులు, ఉన్నతాధాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement