బయటకెళ్తే భయమేస్తోందమ్మా | No Guarantee For Womens In TDP Government | Sakshi
Sakshi News home page

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

Published Tue, Mar 19 2019 9:55 AM | Last Updated on Tue, Mar 19 2019 9:56 AM

No Guarantee For Womens In TDP Government - Sakshi

సాక్షి, కృష్ణా : ఏం వదినా.. ఏం కూర వండుతున్నావు.. ఇవాళ..’’అప్పటికే కూరలు తరుగుతున్న పుల్లమ్మ.. తప్పదుగా రమణమ్మా... సాయంత్రానికి ఏదోకటి వండిపెట్టాలి..ఉదయం వండింది పిల్లలు తినడం లేదు..అవునూ, పెద్దమ్మాయి ఏదీ.. ఇంట్లో కనపడటం లేదే..‘ఇవాళ కాలేజీ ఉందంటా.. పొద్దున్నే వెళ్లింది.. ఈపాటికే రావాలి.. టైం కూడా ఆరు అవుతోంది.ఎటువెళ్లిందో ఏమిటో.అవును వదినా, బయటకు వెళ్లిన ఆడపిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారన్న గ్యారంటీ లేకుండా పోయింది. ప్రభుత్వం వాళ్లు ఏవేవో చేశామంటున్నారేగానీ ప్రభుత్వాధికారులకే  రక్షణ కల్పించ లేకపోతే మనవంటి వాళ్ల పరిస్థితి చెప్పేదేముంటుంది’నిజమేనమ్మా.. కలికాలం.. మన చిన్నతనంలో ఇంత భయమే లేదు.  మహిళపై ఎన్నెన్ని అఘాత్యాలు జరిగుతున్నాయో పత్రికల్లో, టీవీల్లో వస్తున్నాయి... చూశావా..

రామలక్ష్మి : అవును తులశి అంత కంగారుగా ఉన్నావు.. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా! నీ ముఖంలో ఎప్పుడూ అంత ఆందోళన చూడలేదే..
తులశి : ఏం చెప్పను.. రామలక్ష్మక్క.. చదువు కోసం వెళ్లిన అమ్మాయి రాధ ఇప్పటికీ ఇంటికి రాలేదు.. రోజులు చూస్తే బాగాలేదు.. ఏం జరిగిందో ఏంటో.. కంగారుగా ఉంది..
రామలక్ష్మి : ఏమీ కాదులే తులశి బస్సు టయానికి రాలేదోమే.. కంగారు పడకు.. వచ్చేస్తుందిలే ..
తులశి : ఏం లేదక్క.. ఈ మధ్య వరుసగా జరుగుతున్న బాలికలపై అఘాయిత్యాలు, హత్యలు చూసి భయమేస్తోంది.. పిల్లలను బయటకు పంపితే వచ్చే వరకు దినదినగండంగా మారింది..
పెరంటాలు (పనిమనిషి) : అమ్మగారు.. మీ మాటకు అడ్డు వస్తున్నానని ఏం అనుకోవద్దండి.. ఈ ప్రభుత్వంలో ఆడోళ్లకు రక్షణ లేదండీ.. అప్పట్లో ఏకంగా మహిళా తహసీల్దారు వనజాక్షిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎవరేం చేయలేకపోయారు.. మళ్లీ ఆయనగారికే సీటిచ్చారు.. ఏంటండీ ఇంత దారుణం..
నీలాంబరి (పక్కింటావిడ) : ఓసీ పిచ్చి పెరంటాలు.. రాజకీయ నాయకులు అంటే అంతే నే మీటింగులలో మహిళ రక్షణే మా కర్తవ్యం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు.. మనపై దాడులు జరిగితే వాళ్ల మనుషులను కాపాడుకోడానికి ఎంతకైన తెగిస్తారు.. 
రామలక్ష్మి : మహబాగా చెప్పావు.. నీలాంబరి.. విజయవాడలో కాల్‌మనీ విషయాన్నే తీసుకోండి.. అధికార నాయకులు అవసరానికి డబ్బులిచ్చి.. మహిళలతో ఎంచక్కా నీచమైన పనులు చేయించారో గుర్తుందా.. ఎన్ని కేసులు పెడితే ఏంటి.. మళ్లీ వాళ్లు అదే కాల్‌మనీ చేస్తున్నారు.. ఇదేక్కడి న్యాయం
పెరంటాలు : అద్సరేగాని అమ్మగారు... నాకు తెలియక అడుగుతున్నాను.. చంద్రబాబుగారు..మొన్న ఎన్నికల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.. అవి ఎక్కడా కనిపంచవేమిటీ.. 
తులశి : నిజమే పేరంటాలు.. ఈ విషయం మాకు గుర్తులేదు.. పర్వాలేదే.. లోకజ్ఞానం బాగానే ఉంది.. పోలీసు స్టేషన్లే కాదు.. ఏకంగా మహిళలకు ప్రత్యేక బస్సులు వేస్తామన్నారు.. రాజకీయ నాయకుల హామీలు అంటే ఇంతేనే.. చెప్పింది చేయరు.. 
కనకమ్మ : (వస్తూ వస్తూనే.) మాయదారి మద్యం,. తాగుబోతు సచ్చినోట్లు .. పనీపాట లేదు.. అంటూ తిట్టుకుంటోంది.. 
రామలక్ష్మి : ఏంటీ కనకమ్మ ఎవరిని తిడుతున్నావు..
కనకమ్మ :  ఏ చెప్పనమ్మ.. మా వీధి చివరనే బెల్టు షాపు పెట్టారు.. గాలిసచ్చినోళ్లంతే అక్కడే తాగి మీదకు వచ్చేస్తున్నారు.. ఆడోళ్లంటే గౌరవం లేకుండా పోయింది.. చీ.. ఛీ
రామలక్ష్మి : చంద్రబాబు మొన్న ఎన్నికల్లో బెల్టు షాపులు అనేవి ఉండవన్నారు.. అది నెరవేర్చలేదు.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మరిన్నింటికి అనుమతులు ఇచ్చారు. 
తులశి : అందుకే అక్క.. ఈ సారి రాజశేఖరరెడ్డి కొడుకు జగన్‌బాబుకు ఓటేద్దామనుకుంటున్నా.. ఆయనొస్తే మహిళలకు మేలు జరుగుతుందనే నమ్మకం నాకుంది..
పెరంటాలు : అమ్మా గారు.. అదిగో రాధమ్మ వచ్చేసింది.. 
తులశి : రాధ ఇంత లేటెందుకయ్యిందమ్మా.. ఎంత కంగారుపడ్డామో... తెలుసా
రాథ : బస్టాండు దగ్గర ఓ ముసలావిడ ఎండలకు కళ్లు తిరిగిపడిపోయిందమ్మా.. దెబ్బలు తగిలాయి.. అందరం కలసి ఆస్పత్రికి తీసుకెళ్లాం.. అందుకే లేటయ్యింది.. 
తులశి : ఎంత మంచి పనిచేస్తావమ్మా.. రా ఏమైనా తిందువుగాని.. అంటూ అందరూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
రాథ : అమ్మా, వీధి చివర మద్యం కొట్టువద్ద మందుబాబుల గొడవ ఎక్కువగా ఉంది.. సాయంత్రమైతే గొడవలు చేస్తున్నారు. ఒక్కళ్లమే రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది..
తులశి : నేను వీధి చివరి దాకా వచ్చి నిలుచుంటాలేమ్మా..  నీవు కాలేజీ బస్సు దిగిన తరువాత ఇద్దరమూ కలిసే ఇంటికొద్దాం.
రాథ : ఇలా ఎన్నాళ్లమా?
తులశి : తప్పదమ్మా.. మళ్లీ  స్వర్ణయుగం పాలన  వచ్చే వరకు..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement