టీడీపీ శ్రేణుల దౌర్జన్యం | Attempted attack on rice distributor | Sakshi
Sakshi News home page

టీడీపీ శ్రేణుల దౌర్జన్యం

Published Thu, Jun 6 2024 4:36 AM | Last Updated on Thu, Jun 6 2024 4:36 AM

Attempted attack on rice distributor

రైస్‌ వాహనానికి టీడీపీ జెండాలు కట్టి జగన్‌ చిత్రపటాన్ని చించివేసిన వైనం

రైస్‌ పంపిణీదారుడిపై దాడికి యత్నం

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘటన

మచిలీపట్నంటౌన్‌: ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్య­ర్థి విజయం సాధించడంతో కృష్ణాజిల్లా మచి­లీ­పట్నంలో ఆ పార్టీ శ్రేణులు దౌర్జన్యాలకు దిగు­తు­న్నాయి. ఓ పక్క కౌంటింగ్‌లో టీడీపీకి అను­కూల పవనాలు వీస్తున్న సమయంలో పేర్ని వెంకట్రా­మయ్య (నాని) ఇంటి సమీపంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడిన టీడీ­పీ, జనసేన కార్య­కర్తలు బుధవారం మళ్లీ దాడు­­లకు యత్నించారు. నగరంలోని పలు కాల­నీల్లో ఆయా ప్రాంతాల్లోని టీడీపీ కార్యకర్తలు బైక్‌ల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్ధా­లతో హడావుడి చేశారు. 

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల నివాసప్రాంతంలో  పెద్ద ఎత్తున బాణాసంచాను కాలుస్తూ నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు ది­గారు. బుధవారం నగరంలో­ని 28వ డివిజన్‌ ఓగీస్‌పేట ప్రాంతంలో మొబైల్‌ డిస్ట్రి­బ్యూç­Ùన్‌ యూనిట్‌ (ఎండీయు) వాహనం ద్వారా నిర్వా­ç­ßæకుడు పిండి శ్యాంబాబు కార్డు­దా­రులకు సరు­కులు అందజేస్తు­న్నా­డు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు మూ­కు­మ్మడిగా అక్క­డ­కు చేరుకుని ముందు వాహ­నం నుంచి దిగా­లని శ్యాంబాబును దౌర్జన్యంగా దింపి దాడి చేయ­బోయారు.

దీంతో అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకు­న్నా­రు. వాహనానికి టీడీపీ జెండాలను కట్టి జగన్‌­స్టిక్కర్లను చించివేశారు. దీంతో శ్యాంబాబు విష­యాన్ని పౌర­సర­ఫరాల శాఖ ఉన్న­తాధి­కారు­లతో పాటు డీఎస్‌­వో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. బుధవారం వరకు ఎన్నికల కోడ్‌ ఉన్నందున గురు­వా­రం ఆ ప్రాంతానికి వెళ్లి సరు­కులు పంపిణీ చేయా­లని, మళ్లీ వారు ఏమైనా ఇబ్బంది పెడి­తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement