
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం మండలం గరాల దిబ్బలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ వర్గీయులపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కారణం లేకుండానే గరాలదిబ్బలో టీడీపీ వర్గీయులు గొడవలు సృష్టిస్తున్నారు. గత రాత్రి వేటకు వెళ్లి వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కత్తులు, రాళ్లతో విరుచుకుపడ్డారు. దాడిలో 25 నుంచి 30 మంది టీడీపీ వర్గీయులు పాల్గొన్నారు. 12 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: బరి తెగించిన టీడీపీ నేతలు.. అంతా వారి కనుసన్నల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment