
మచిలీపట్నం(చిలకలపూడి): మచిలీపట్నం నగరానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేయటంతో పాటు వేరే మహిళతో పరిచయం ఏర్పరుచుకున్న ఘటనలపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. సీఐ అబ్ధుల్‌నబీ తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నగరానికి చెందిన బిల్డర్ విజయ్ ఓ మహిళతో ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆ మహిళ వద్ద నుంచి కొంత సొమ్ము, బంగారం తీసుకున్నారన్నాడు.
విజయ్ కూడా ఆ మహిళకు పలు దఫాలుగా ఆర్థిక సాయం చేశాడు. ఇటీవల విజయ్ మరో మహిళతో పరిచయం ఏర్పరుచుకుని మొదట సహజీవనం చేసిన మహిళను దూరంగా పెడుతూ వచ్చాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహం చెంది మరో అమ్మాయితో విజయ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి నేను ఇచ్చిన సొమ్ము, బంగారం తిరిగి ఇమ్మని వాగ్వాదానికి దిగిందన్నారు.
విజయ్‌కు సంబంధించిన కారును తగులబెట్టే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారన్నారని తెలిపారు. సహజీవనం చేసిన మహిళ విజయ్‌తో ఉన్న మహిళ ఇరువురు కొద్దిసేపు వాగ్వాదానికి దిగి దాడులకు కూడా పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదుతో పాటు విజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై పరస్పర కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment