పిట్టలదొరను మించేలా హామీలు
చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత
ఈసారి గెలిస్తే అద్భుతాలు చేస్తానంటూ కబుర్లు
రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందే యత్నం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు.
రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్
మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్‌కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్‌సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
పిట్టలదొర వాగ్దానాలు
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్‌ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు
మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.
ఈ ప్రశ్నలకు బదులేవి?
ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు.
👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు?
👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు.
👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు.
👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్‌సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment