Balashowry reddy
-
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్‌కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
ప్రతిపాదనల చిట్టా.. రైలెక్కాలి పట్టా
రాష్ట్రానికి కేంద్రం కొత్త రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విన్నవించారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు కేటాయించాల్సిన నిధులు.. ఇతరత్రా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. పలు ప్రాంతాలకు కావాల్సిన కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన.. రైల్వేల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరారు. సాక్షి, విజయవాడ: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా విజయవాడలో సమావేశమయ్యారు. స్థానిక సత్యనారాయణపురంలోని ఈటీటీఎస్లో నిర్వహించిన సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎంపీలతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. కాగా విజయవాడ నుంచి కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్ల కోసం అనేక వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించనందుకు సమావేశం నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) బాయ్‌కాట్ చేశారు. అంతకుముందు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి పలు సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేశారు. విజయవాడ–మేళ్ల చెరువు రైల్వేలైను, విజయవాడ–భద్రాచలం రైల్వేలైనుకు అవసరమైన ఆర్ఓబీ వెంటనే మంజూరు చేయాలని.. బెంగళూరు, ముంబై, వేలాంగణి ప్రాంతాలకు కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మోడల్ స్టేషన్‌గా బందరును తీర్చిదిద్దండి మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను మోడల్‌రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి జీఎంకు విన్నవించారు. అలాగే వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం– బెంగళూరు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యూలర్ రైలుగా మార్చాలని కోరారు. మరిన్ని ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ► మచిలీపట్నం–విశాఖపట్నం పాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చి, ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల విశాఖ–మచిలీపట్నం మధ్య ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. కాకినాడ– షిర్డీసాయి నగర్ ఎక్స్‌ప్రెస్‌కు గుడివాడలో కొన్ని అదనపు బోగీలు కలపాలి. దీనివల్ల కృష్ణాజిల్లా వాసులకు షిర్డీనగర్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ► పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుంచి కాకుండా మచిలీపట్నం నుంచి నడపాలి. ► మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, ధర్మవరం–మచిలీపట్నం, విజయవాడ–మచిలీపట్నం, మచిలీపట్నం–గుడివాడ రైళ్లకు వడ్లమన్నాడులో హల్ట్ ఇవ్వాలని స్థానికులు కోరుతుండటంతో పరిశీలించాలి. ► విజయవాడ–జగ్గయ్యపేట–సిక్రిందాబాద్ మధ్య గూడ్స్ రైలు మార్గం ఉంది. ఆ మార్గంలో పాసింజర్ రైలు ఏర్పాటు చేయాలి. దీనవల్ల రెండు లక్షల మంది రైల్వే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. బాపట్లలో వెయిటింగ్ హాల్ అవసరం బాపట్ల స్టేషన్లో ఏవీటీఎంలను రెండు, మూడు ప్లాట్‌ఫారాలపై ఏర్పాటు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్.. ప్రయాణికులకు వెయిటింగ్ హల్ ఏర్పాటు చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విన్నవించారు. అలాగే వాహనాల పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని వినతులు ఇవి.. ► వేమూరు నియోజకవర్గం వలివేరు గ్రామంలో హాల్టింగ్ రైల్వేస్టేషన్ ను పునరుద్ధరించాలి. ► వేమూరు రైల్వేస్టేషన్ నందు గలం రైల్వే పార్కు పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలి. ► చీరాల సమీపంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ గ్రీనరీగా మార్చాలి. ► సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మనబ్రోలు గ్రామం రైల్వేస్టేషన్ నందు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్‌ను పునరుద్ధరించాలి. ► చీరాల నియోజకవర్గం పైర్ ఆఫీసు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. ► వేటపాలెం రైల్వేస్టేషన్ నందు బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. డెమో రైలు వద్దు మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ► అలాగే లెవెల్ క్రాసింగ్స్ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి.. ► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. ► సికింద్రాబాద్–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి. ► నల్లపాడు–నంద్యాల సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి. ► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి. ► మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ► అలాగే లెవెల్ క్రాసింగ్స్ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి.. ► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. ► సికింద్రాబాద్–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి. ► నల్లపాడు–నంద్యాల సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి. ► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి. -
హిందీ-తెలుగు వంతెన
- డాక్టర్ వై.బాలశౌరిరెడ్డి 1 జూలై 1928 - 15 సెప్టెంబర్ 2015 ‘‘బాల’ శబ్దం పేరులోనేగానీ, బాలశౌరిరెడ్డి గారు నిజానికి ‘ప్రౌఢ’ రచయిత. హిందీ తెలుగు భాషల మధ్య వారధి బంధించిన మహావ్యక్తి. ఉభయభాషల్లో వారికున్న పాండిత్యం వల్ల ‘రామాయణ కాలంలో భారతీ సంస్కృతి’(హిందీ మూలం: డాక్టర్ ఎస్.ఎస్.వ్యాస్) అనువాదం సాధ్యపడింది. తెలుగువారిని హిందీవారికి పరిచయం చేసిన చాలాకొద్దిమందిలో బాలశౌరిరెడ్డి గారొకరు. వారిని ఉత్తర భారతదేశంలో ఎంతో గౌరవించారు’’ అన్నారు దాశరథి. నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ని 1969లో బాలశౌరి హిందీ పాఠకులకు పరిచయం చేశారు. 1971లో కందుకూరి వీరేశలింగం పంతులు ‘రాజశేఖర చరిత్రము’ను అనువదించారు. తర్వాతి యేడు రావిశాస్త్రి ‘అల్పజీవి’ని హిందీ చేశారు. 1954లోనే తిక్కన, పోతన, పెద్దన, వేమన, చేమకూర వేంకటకవుల పద్యాల్ని హిందీలోకి మోసుకెళ్లారు. ఆంధ్ర హిందీ పరిషత్తు, హైదరాబాద్ వారు ఆ 625 పద్యాలనూ ‘పంచామృత్’ పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని చదివి అప్పటి గవర్నర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య బాలశౌరికి అభినందన లేఖ పంపారు. పులివెందులలోని మారుమూల పల్లెటూరు గొల్లల గూడూరులో జన్మించారు బాలశౌరిరెడ్డి. 1946లో మద్రాసు హిందీ ప్రచార సభలో గాంధీజీని కలిశారు; హిందీలో ఆయన ‘ఆటోగ్రాఫ్’ తీసుకున్నారు. ‘ఆ సంతకం నాలో ఆసక్తిని, హిందీభాష పట్ల అభిలాషను తీవ్రంగా పెంచిం’దని తరచూ చెప్పేవారు. అన్నట్టుగానే హిందీలో 75, తెలుగులో 13 రచనలు చేశారు. తెలుగులోంచి దాదాపు 235 కథల్ని, 5 సంపుటాలుగా హిందీలోకి మోసుకుపోయి ‘తెలుగు కథ’ ఉనికికి ఊపిరి పోసిన ఘనత బాలశౌరికి దక్కుతుంది. నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు 30 మంది సాహిత్యకారుల ‘తెలుగు వాఙ్మయ చరిత్ర’ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేత ప్రచురించిన ఘనత కూడా! 1966-1988 వరకు రెండు దశాబ్దాల కాలం హిందీ ‘చందమామ’కు సంపాదకుడుగా పనిచేశారు. వీరి ఆలోచనా విధానం, ఎంపిక శైలి వంటి కారణాల వల్ల పత్రిక సర్క్యులేషన్ 75 వేలను దాటి 1,67,000కు చేరుకోగలిగింది. భారతీయ భాషా పరిషత్తు డెరైక్టరుగానూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల హిందీ అకాడమీల అధ్యక్షుడుగానూ పనిచేశారు. 65 ఏళ్లు మద్రాసులోనే ప్రవాసజీవితం గడిపిన బాలశౌరిరెడ్డి ‘నేను ఇంట ఓడి, రచ్చ గెలిచాను’ అని ఆవేదన చెందేవారు. ‘కడప నేల మట్టిలో సాహిత్య శక్తి వుంది’ అని గర్వంగా చెప్పేవారు. కడపోత్సవాల సందర్భంగా వారికి ఘనసత్కారం జరిగింది. వారి ‘జ్ఞాపకాలు’ నేను సావనీరులో రాశాను. ఆ అక్షరాల్ని చూస్కొని కళ్లనిండా ఆత్మీయతను వర్షించారు. వారిప్పుడు లేరు. వారి రచనలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఠి డాక్టర్ వేంపల్లి గంగాధర్ 9440074893