Thugs Brutally Killed Doctor Wife In Machilipatnam, Later Robbed Jewellery - Sakshi

Machilipatnam Doctor Wife Murder: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య

Jul 26 2023 2:34 PM | Updated on Jul 26 2023 3:58 PM

Doctor Wife Assassination In Machilipatnam - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో దారుణం జరిగింది. జవారుపేట సెంటర్‌లో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్ వైద్యుడు ముచ్చెర్ల మహేశ్వరరావు భార్య రాధను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దోపిడీకి కోసం ఇంట్లో చొరబడి తన భార్యను హత్య చేసినట్లు డాక్టర్‌ చెబుతున్నారు. గొంతుకోసి హత్య చేసి, నగదు, నగలు దోపిడీ చేశారని ఆయన తెలిపారు

ఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుంది. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు.. ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ రవి ప్రకాష్  పరిశీలించారు.

ఆ ఇంటికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చదవండి: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement