మచిలీపట్నంలో విషాద ఘటన | Mourn Father Deceased At Daughter Grave In Machilipatnam | Sakshi
Sakshi News home page

కూతురి సమాధి వద్దే తండ్రి తుది శ్వాస

Aug 26 2020 12:56 PM | Updated on Aug 26 2020 1:56 PM

Mourn Father Deceased At Daughter Grave In Machilipatnam - Sakshi

అప్పటి నుంచి కుమార్తెను తలచుకుంటూ గిరిబాబు పదేపదే రేణుకాదేవి సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు రాత్రికి తిరిగి రాలేదు.

సాక్షి, మచిలీపట్నం: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తనువు చాలించడంతో ఓ తండ్రి ఆమెనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు. తీవ్ర దుఃఖంలో ఆమె సమాధి వద్దే కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. జలాల్‌పేటకు చెందిన లక్కోజి గిరిబాబు (52) రోల్డ్‌ గోల్డ్‌ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. పిల్లలను ప్రేమగా పెంచుకున్న గిరిబాబు కొంతకాలం క్రితం పెద్ద కుమార్తె రేణుకా దేవికి వివాహం చేశాడు. ప్రసవం నిమిత్తం ఆస్పతిలో చేరిన ఆమె అస్వస్థతకు గురై ఇటీవల మృతి చెందింది.

అప్పటి నుంచి కుమార్తెను తలచుకుంటూ గిరిబాబు పదేపదే రేణుకాదేవి సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు రాత్రికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం అనుమానం వచ్చిన బంధువులు శ్మశానం వద్దకు వెళ్లి చూడగా కుమార్తె సమాధి వద్ద గిరిబాబు విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
(చదవండి: అనుమానిస్తోందని.. హతమార్చాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement