సాక్షి, కృష్ణా: మచిలీపట్నానికి చంద్రబాబు తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మచిలీపట్నం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పోర్టు రాకుండా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారని తెలిపారు.
ఇక్కడ(బందరు) పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ ఉంటుందని చంద్రబాబు కుట్ర చేశారు. పోర్టు రాకూడదని వేల ఎకరాలను కొనుగోలు చేశారు. తాను అమరావతిలో కొన్న భూముల రేట్లు పెంచుకునే యత్నం చేశారు. ఇప్పుడు బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలగిపోయాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ. 420 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గోల్డ్ కవరింగ్ పరిశ్రమలకు విద్యుత్‌ఛార్జీలను తగ్గించాం. రూ.7.60పై. నుంచి రూ.3.75పై. ఛార్జీలను తగ్గించాం. నాలుగు పోర్టుల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి.ఇకపై ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
మేం వచ్చాక రైతుల కల సాకారం అయ్యింది. రూ. 550 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. గతంలో బందరు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న ఒక్క అధికారి ఉండేవారు కాదు. ఇప్పుడు కలెక్టర్‌తో సహా యంత్రాగం మొత్తం ఇక్కడే ఉంటోంది. మరో 24 నెలల్లోనే బందరు రూపు రేఖలు మారిపోతాయని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment