
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ ఆనంద్ వీరంగం సృష్టించారు. సచివాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన అనుచరులకు వెంటనే వ్యాక్సిన్ వేయాలని హడావుడి చేశారు. రెండో డోస్ మాత్రమే వేస్తున్నామని ఏఎన్‌ఎమ్ చెప్పిన కానీ.. వినకుండా అసభ్యంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్పొరేటర్ ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయానికి రాద్దాంతం చేస్తున్నారు
ఐటీ పాలసీ లక్ష్యం ఇదే కావాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment