outrageous
-
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్‌కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్‌సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ ఆనంద్ వీరంగం సృష్టించారు. సచివాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన అనుచరులకు వెంటనే వ్యాక్సిన్ వేయాలని హడావుడి చేశారు. రెండో డోస్ మాత్రమే వేస్తున్నామని ఏఎన్ఎమ్ చెప్పిన కానీ.. వినకుండా అసభ్యంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్పొరేటర్ ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయానికి రాద్దాంతం చేస్తున్నారు ఐటీ పాలసీ లక్ష్యం ఇదే కావాలి: సీఎం జగన్ -
మరోసారి వివాదాల్లో నాగేశ్వరరావు
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అత్యంత దారుణమైన రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన రావుపై ఢిల్లీ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. (సీబీఐ అదనపు డైరెక్టర్ తొలగింపు..!) హిందువుల అణచివేత ముస్లింలకు అనుకూలంగా భారత చరిత్రను వక్రీకరించారనే అర్థం వచ్చేలా నాగేశ్వరరావు ట్విటర్లో పోస్ట్‌లు పెట్టారు. భారత నాగరికతను కుట్ర ప్రకారం ఇస్లామీకరణ(అబ్రహమైజేషన్) చేశారని ఆయన ఆరోపించారు. హిందువులను అన్ని రకాలుగా అణచివేశారని పలు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష అనుకూల విద్యావేత్తలను నెత్తిన పెట్టుకుని, హిందూ అనుకూల జాతీయవాద పండితులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. 1947-77 మధ్య 30 ఏళ్లలో దేశానికి విద్యాశాఖ మంత్రులుగా 20 ఏళ్లు ముస్లింలు, మిగతా పదేళ్లు వామపక్షవాదులు ఉన్నారని.. హిందువుల పతనానికి ఇది మొదటి దశగా అని వర్ణించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 11 ఏళ్ల పాటు(1947-58) విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. విద్యతో పాటు మీడియా, వినోద రంగాలను ఇస్లామీకరణ చేశారని.. హిందువుల ఉనికి ముప్పు వాటిల్లేలా కుట్రలు చేశారని నాగేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు. రావుపై చర్యలు తీసుకోండి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బృందా కారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం సమాజానికి చెందిన ఇతర ప్రముఖ విద్యావేత్తలను అవమానించి రెండు వర్గాల మధ్య శత్రుత్వ భావనలను ప్రేరేపించడానికి నాగేశ్వరరావు ప్రయత్నించారని కారత్ తన లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనలు ఉల్లఘించి బహిరంగంగా రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు వ్యాఖ్యలను పలువురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు తప్పుబట్టారు. వివాదాలకు చిరునామా మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నాగేశ్వరరావుకు కొత్త కాదని ఆయన గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. తొంభై దశకం చివరలో ఒడిశాలోని బెర్హంపూర్ డెవలప్మెంట్ అథారిటీలో అధికారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని విషపూరిత మత ప్రకటనలు చేశారు. రెండు అధికారిక విచారణలు ఆయనను దోషిగా గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాయి. 2018లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రావును నియమించినప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. -
వినుకొండ టీడీపీ నేతలు దౌర్జన్యం
-
టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల దాష్టికం
-
పెంపుడు కుక్కకు సారీ చెప్పలేదని..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తమ పెంపుడు కుక్కకు సారీ చెప్పనందుకు ముగ్గురు దుండగులు ఓ మినీ ట్రక్కు డ్రైవర్‌ను కత్తులు, స్క్రూ డ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఢిల్లీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న విజేందర్ రాణా(45) శుక్రవారం అర్ధరాత్రి తన వాహనంలో ఇంటికి బయలుదేరాడు. ఇక్కడి ఉత్తమ్ నగర్‌లోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో అంకిత్, అతని సోదరుడు పరస్, స్నేహితుడు దేవ్ చోప్రాలు తమ కుక్క టామీతో కలిసి షికారుకు వచ్చారు. శునకాన్ని రోడ్డుకు ఓవైపు వదిలేసి మరోవైపు వీరు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన విజేందర్ ట్రక్కును చూసిన టామీ గట్టిగా అరిచింది. దీంతో వాహనాన్ని బలవంతంగా ఆపిన ముగ్గురు దుండగులు విజేందర్‌ను జుట్టుపట్టుకుని కిందకు లాగారు. తమ కుక్క టామీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తనతో గొడవ పడకుండా కుక్కను జాగ్రత్తగా చూసుకోమని విజేందర్ ముందుకు కదిలాడు. కొద్దిదూరం వెళ్లగానే బాధితుడి వాహనాన్ని అడ్డగించిన ముగ్గురు దుండగులు కత్తులు, స్క్రూడ్రైవర్‌తో అతడిని ఆరుసార్లు పొడిచారు. విజేందర్ ఆర్తనాదాలు విని కాపాడేందుకు పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన సోదరుడు రాజేశ్‌కు మూడు కత్తిపోట్లు పడ్డాయి. వీరిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా విజేందర్ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న రాజేశ్‌ను మెరుగైన చికిత్స కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మైదుకూరులో టీడీపీ నేతల దౌర్జన్యం
-
శరవేగంగా తెలంగాణ రాష్ర్ట ప్రక్రియ
తూప్రాన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పాలాట గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత సోనియాగాంధీ తెలంగాణపై ప్రకటన చేశారన్నారు. తాము చేపడు తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు తమ పా ర్టీలో చేరుతున్నారన్నారు. ఇది జీర్ణించుకోలేని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు లక్ష్మినర్సింలుగౌడ్, వెంకట్‌రెడ్డి, ఆర్.నర్సింగ్రావుగౌడ్, ఆర్.కృష్ణగౌడ్, రమెశ్గౌడ్, శ్రీశైలం యాదవ్, నాగరాజుగౌడ్, దీపక్‌రెడ్డి, పెంటాగౌడ్, భగవన్‌రెడ్డి, జావెద్పాపా, నరేన్‌రెడ్డి, సామల అశోక్, ఉమర్, సత్యనారాయణగౌడ్, అనిల్ పాల్గొన్నారు.