సాక్షి, కృష్ణా: బందరు పోర్టు చిరకాల స్వప్నమని, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా.. సోమవారం జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదు. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆయన ఆకాంక్షించారు.
35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారాయన. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకూ ఇది చేరువలో ఉంటుందని తెలిపారాయన. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment