bandaru port
-
బందరు తీరంలో.. త్వరలో 'లంగరు'
కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది. దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖ ద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభించిన ఏడు నెలల్లోనే కీలకమైన బ్రేక్ వాటర్ పనులను పూర్తిచేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 25,000 మందికి ఉపాధి క ల్పించే ఈ పోర్టు.. 2025 ఆరంభానికల్లా పూర్తయ్యేలా పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. – సాక్షి, అమరావతి బందరు పోర్టు తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే 22, 2023న భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించడంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నార్త్‌బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తికాగా, సౌత్‌బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, రెండు బెర్తుల నిర్మాణ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా వేయగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము, కంటైనర్ల ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అంచనా. ఈ పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సముద్రంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండడంతో పాటు తీరప్రాంతం కూడా ఇసుకతో ఉండటంతో భారీ కట్టడాల నిర్మాణానికి అనువుగా ఉండదు. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను పటిష్టపరుస్తున్నారు. 2,075 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రెయిన్స్ (పీవీడీ) విధానంలో భూమిలోంచి నీటిని తోడి ఆ స్థానంలో మట్టిని పంపి భారీ కట్టడాలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా 52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడిపోయడం ద్వారా భారీ ఓడలు నిలుపుకునే విధంగా సముద్రాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ్రస్టేలియా నుంచి అత్యాధునిక డ్రెడ్జింగ్ మిషన్లను తీసుకొస్తున్నారు. ఏడు నెలల కాలంలోనే 12 శాతం నిర్మాణ పనులను పూర్తిచేయడం ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డు రికార్డు సృష్టించింది. తండ్రి కోరికను నెరవేరుస్తున్న తనయుడు.. నిజానికి.. మచిలీపట్నం పోర్టు పునరుద్ధరణ అనేది స్థానిక ప్రజల చిరకాల స్వప్నమంటూ 2004 తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తీసుకెళ్లారు. వారి కోరికను నెరవేర్చే విధంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కెంది. 2014 తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు కొబ్టరికాయ కొట్టి మమ అనిపించారు. కానీ, దీనికి భిన్నంగా ప్రసుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం.. సీఎం పదవి చేపట్టిన ఏడాదిలోపే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా జగన్ సర్కారు నిధులను కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌తో 2023, ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా 2023, ఫిబ్రవరి 28న వచ్చాయి. ఇలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించడమే కాక ఆ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పోర్టు ఎప్పుడెప్పుడు ఎలా..? ♦ 1590 నుంచి ఎగుమతి దిగుమతులతో మచిలీపట్నం పోర్టు కళకళ.. ♦ 1970 నుంచి నిలిచిపోయిన పోర్టు కార్యకలాపాలు ♦ బందరు వాసుల చిరకాల వాంఛను తీరుస్తూ దివంగత సీఎం వైఎస్ 2008 ఏప్రిల్‌లో శంకుస్థాపన ♦ ఆయన మరణానంతరం అటకెక్కిన పోర్టు పనులు ♦ ఎన్నికలకు నెలన్నర ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో చంద్రబాబు మరోసారి శంకుస్థాపన ♦ దీనికి భిన్నంగా ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన సీఎం జగన్ ♦రూ.11,464 కోట్ల వ్యయంతో 116 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మాణం ప్రారంభం ♦తొలిదశలో రూ.5,254 కోట్ల పెట్టుబడితో పోర్టు పనులకు గత మే 22న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ ♦ 2,075 ఎకరాల్లో నాలుగు బెర్తులతో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణం ♦అలాగే.. ఏడు కి.మీ రైల్వేలైన్ కూడా నిర్మాణం ♦ ఈ పోర్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణకు ప్రయోజనం ♦ దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి ప్రాజెక్టు పూర్తి వ్యయం - 11,464 కోట్లు తొలిదశ పోర్టు సామర్థ్యం - 35 ఎంఎంటీపీఏ పూర్తిస్థాయి సామర్థ్యం - 116 ఎంఎంటీపీఏ బెర్తులు - 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం 2025ప్రారంభం నాటికి భారీ ఓడలు నిలిచేలా నిర్మాణం.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. భారీ ఓడలు నిలిచే విధంగా రాష్ట్రంలోని నాలుగు ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఓడరేవుల సగటు లోతు 7–8 మీటర్లు ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పోర్టుల్లో 16–18 మీటర్ల లోతు ఉండేలా నిర్మిస్తున్నాం. దీంతో భారీ ఓడలు రావడమే కాకుండా సరుకు రవాణా కూడా పెరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారం మొత్తం ఇప్పుడు మచిలీపటా్ననికే వస్తుంది. – రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు 2025 నాటికి రెడీ.. అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడు నెలల్లోనే 12 శాతం పనులు పూర్తిచేశాం. 6.5 కి.మీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నాలుగు బిల్డింగ్లు, జాతీయ రహదారి 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి,మీ రోడ్డు అనుసంధానం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు బెర్తులకు సంబంధించి ఈ పైల్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 ప్రారంభం నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నాం. – ఎం. దయాసాగర్, ఎండీ, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంతోషంగాఉంది.. బందరు ప్రాంత అభివృద్ధి ఈ పోర్టు నిర్మాణంతో సాకారం కానుంది. పోర్టు నిర్మాణానికి నాకున్న భూమిని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. భావితరాల మేలు కోసం మాజీమంత్రి పేర్ని నాని చేసిన కృషి ఫలించింది. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, పోతేపల్లి, బందరు మండలం గర్వంగా ఉంది.. సొంత ఊరు అభివృద్ధికి కీలకమైన బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగాను, గర్వంగాను ఉంది. నేను ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడిని. కానీ, ఈ పోర్టు నిర్మాణంలో నా వంతు కృషిచేయాలన్న తలంపుతో మచిలీపట్నంకు బదిలీ చేయించుకున్నా. బందరు పోర్టును జాతీయ రహదారికి అనుసంధానించే పనిలో పాలుపంచుకుంటున్నా. త్వరలో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. – బి.నాగసూర్య చంద్ర, అసిస్టెంట్ మేనేజర్, రైట్స్ సంస్థ -
మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు
కృష్ణా జిల్లా: మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు పడింది. నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులకు మాజీమంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన పేర్ని నాని.. ‘ సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ పనులను సమాంతరంగా పూర్తి చేస్తాం. నాలుగు బెర్త్‌ల నిర్మాణానికి సంబంధించి సాయిల్ టెస్టులు జరుగుతున్నాయి. మొన్నటి వరకూ దావాలతో ఇబ్బంది పెట్టారు. అన్ని ఇబ్బందులను పోర్టు పనులు ప్రారంభించాం. 26 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేస్తాం’ అని అన్నారు. కాగా, మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్లలోపే మరో నాలుగు పోర్టుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల్లో పనులు శరవేగంగా జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక ఈ జాబితాలో మచిలీపట్నం పోర్టు కూడా చేరింది. -
సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బందరుకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బందరు పోర్టు నిర్మాణపనులను ప్రారంభించేందుకు సీఎం జగన్ మచిలీపట్నం వచ్చిన క్రమంలో భారత్ స్కౌట్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగం సభలో పేర్ని నాని ప్రసంగించారు. ‘సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే. బందరు అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. బందరుకు సీఎం జగన్ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు.నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు. బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం.బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు. రూ. 197 కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారు. బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు. బందరుకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ది. 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు. ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు.బందరులో గోల్డ్ కవరింగ్ యూనిట్లను నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌ది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. -
‘కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రమిది’
సాక్షి, కృష్ణా: బందరు పోర్టు చిరకాల స్వప్నమని, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా.. సోమవారం జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదు. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆయన ఆకాంక్షించారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారాయన. పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకూ ఇది చేరువలో ఉంటుందని తెలిపారాయన. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
మచిలీపట్నం: జగనన్న కోసం పోటెత్తిన జనం (ఫొటోలు)
-
బందరు పోర్టు చిరకాల స్వప్నం: సీఎం జగన్
Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు బందరుతో సముద్ర వర్తకానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉంది నెరవేరని ఈ కల ఇప్పుడు నెరవేరుతోంది ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారుస్తున్నాం అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేశాం అన్ని అనుమతులు తీసుకొచ్చాం ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేశాం పోర్టు నిర్మాణ పనులకు టెండర్లు పూర్తిచేసిన, ఆపనులు ప్రారంభించాం 5156 కోట్లతో నాలుగు బెర్తులు రాబోతున్నాయి 35 మిలియన్ టన్నుల కెపాసిటీతో స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ పెరిగే కొద్దీ… 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాను కూడా నిర్మిస్తున్నాం 6.5 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారిని నిర్మిస్తున్నాం 7.5 కిలోమీటర్ల గుడివాడ- మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నాం బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నాం అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థకు పోర్టు మంచి ఆధారంగా ఉంటుంది కృష్ణా జిల్లా చరిత్రను ఈ పోర్టు మారుస్తుంది ఈ పోర్టు వల్ల మన రాష్ట్రం మాత్రమే బాగుపడ్డం కాకుండా.. వ్యాపారాలు బాగుపడతాయి మచిలీపట్నం పోర్టు వల్ల పక్క రాష్ట్రాలకు ఉపయోగం ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ ఉపయోగం పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి డిగ్రీలు పూర్తిచేసుకున్న మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి పోర్టు నిర్మాణంలో గతంలో అనేక అడ్డంకులు వచ్చాయి పోర్టు ఇక్కడ రాకూడదని తపన, తాపత్రయ పడ్డాడు చంద్రబాబు 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చంద్రబాబు చేశాడు: దీనివల్ల పోర్టు అడగరని చంద్రబాబు ఇలా చేశాడు ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే.. అందరూ అమరావతిలో తాను బినామీగా పెట్టుకున్న భూములను విపరీతంగా అమ్ముకోవచ్చని తీరని ద్రోహం చేశాడు పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పాను రైతులందరి సంతోషం మధ్య ఆ భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నాం 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి.. మచిలీపట్నంలో మన ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి గతంలో బందరు ముఖ్యపట్టణమైనా.. కలెక్టరుతోపాటు ఏ ఒక్క అధికారీ ఇక్కడ ఉండలేదు:ప్రజలకు మంచిచేస్తూ ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్ మాత్రమే కాదు, మొత్తం యంత్రాంగం జిల్లాలో ఉండేట్టుగా మచిలీపట్నాన్ని జిల్లాకేంద్రంగా చేశాం జిల్లాల విభజన వల్ల ఇది సాధ్యమైంది మరో మూడు నెలల్లో బందరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి అవనిగడ్డ, పెడన, పామర్రు, కైకలూరు ప్రాంతాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి ఏ సమయంలో నైనా మత్స్యసంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా జరుగుతున్నాయి 60శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి నాలుగు నెలల్లో ఇదికూడా అందుబాటులోకి వస్తోంది ఇమిటేషన్ జ్యుయలరీ తయారీకి మద్దతుగా… పాదయాత్రలో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా రూ.7.60 యూనిట్ ధరను.. రూ.3.75లకు తగ్గించాం దాదాపు 45వేలమందికి బతుకుతున్న ఈపరిశ్రమకు మంచిచేశాం ఈ జిల్లా ముఖ్యపట్టణంగా ఎదగడమే కాకుండా.. భారీ స్థాయిలో వర్తకానికి, వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి మచిలీపట్నం కేరాఫ్ అడ్రస్‌గామారబోతోంది రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి మన ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 2025-2026 నాటికి అదనంగామరో 110 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నాం: 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఉన్న పోర్టులు నాలుగు పోర్టులు అయితే.. అక్షరాల రూ.16వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో జోరుగా అడుగులు పడుతున్నాయి కాకినాడ గేట్‌వే ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడ్డాయి ఒక్కో పోర్టులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయి పోర్టు ఆధారిత పరిశ్రమల కారణంగా లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలకు వస్తాయి మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే.. గొప్ప కార్యక్రమం జరగబోతోంది గతంలో చరిత్రలోఎప్పుడూ చూడని విధంగా.. మన ప్రభుత్వంలో అడుగులు ముందుకేశాం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా నిర్మిస్తున్నాం మరోవంక పేదల సంక్షేమానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలూ చేస్తున్నాం పేదరికాన్ని సమూలంగా తీసివేయాలని అక్షరాల రూ.2.10లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం నాన్ డీబీటీ ద్వారా మరో రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం ప్రజలకు అందించే సేవల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా పల్లె పల్లెల్లో ప్రజల ముంగిటకే సేవలు తీసుకు వచ్చాం ప్రజల ప్రభుత్వంగా మార్పులు తీసుకు వచ్చాం ఇప్పటికే 30 లక్షల ఇళ్లపట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో వారికి అందించాం ఇలా రూ.1.5 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టాం అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించాం కాని ఆ యజ్ఞానానికి రాక్షసులు అడ్డు పడ్డారు టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోంది దోచుకోవడం… పంచుకోవడం.. వీరి పని టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరికి తోడు ఒక దత్తపుత్రుడు కలిశాడు అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు ఇందులో పేదల వర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలంట అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట ఇంతకన్నా.. సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధంచేస్తున్నాం వారి వికృతఆలోచనలకు మద్దు ఇవ్వగలమా? పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలి ఈ నెల 26l అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగాచేస్తున్నాను పేదలంటే చంద్రబాబుకు చులకన ఎస్సీలు కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాబు అన్నాడు బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు ఈ బాబు మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు ఈ చంద్రబాబు మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు చంద్రబాబు తాను కనీసం ఒక్క సెంటైనా కూడా పేదవాడికి ఇచ్చిన పోలేదు చంద్రబాబు ఒక్క ఇళ్లస్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని… సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుతోపాటు.. ఈ దుష్టచతుష్టయం.. ఈ గజదొంగల ముఠా అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు కాని మనం ఇస్తే.. వాటిని స్మశానంతో పోలుస్తాడు ఇలాంటి చంద్రబాబుకు అవగాహనైనా ఉందా? కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు కాని చంద్రబాబుకు మానవత్వం లేదు ఇలాంటి కార్యక్రమాన్ని దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు పలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వారిది వారి ఆలోచనలన్నీ.. వారి కుళ్లు, కుతంత్రాలు అన్నీ ఒక్కటే ఒక్క దత్తపుత్రుడ్ని, ఎల్లోమీడియాను మాత్రం నమ్ముకుంటారంట మంచిచేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ. .ఎన్నికల్లో గెలవడమే కష్టమట మీ బిడ్డ పాలనలో మీకు జరిగి ఉంటే.. మీరే సైనికులుగా తోడుగా నిలవండి పేర్ని నాని కామెంట్స్ ► బందరు అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు ► బందరకు సీఎం జగన్ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు ► పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు ► బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు ► నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు ► బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు ► బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం ► బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు ► రూ. 197 కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారు ► బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు ► బందరుకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ది ► 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు ► ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు ► బందరులో గోల్డ్ కవరింగ్ యూనిట్లను నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌ది ► సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే ► 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా? ఎంపీ బాలశౌరి కామెంట్స్ ► బందరు పోర్టు శతాబ్దాల కల ► రామాయపట్నం, భావనపాడు పోర్టులతో లక్షలాది మందికి ఉపాధి ► నిజాయితీగా పోర్టు పనులు ప్రారంభించిన నాయకుడు సీఎం జగన్ ► బందరు పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది 👉బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్ 👉పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయల్దేరిన సీఎం జగన్ 👉పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం జగన్ 👉 సీఎం జగన్ బహిరంగ సభ నేపథ్యంలో.. ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. జననేతకు హృదయపూర్వక స్వాగతమంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు కొందరు. 👉 మచిలీపట్నం(బందరు) ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణ నెలకొంది. సోమవారం ఉదయమే తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారాయన. ఇక.. సీఎం జగన్‌ను చూసేందుకు జనం అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లను చూసి ఆయన అభివాదం చేశారు. కాసేపట్లో బహిరంగ సభకు చేరుకుని ఆయన ప్రసంగించనున్నారు. 👉బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్ 👉తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులు ప్రారంభించిన సీఎం జగన్ 👉గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్ 👉సీఎం పర్యటన నేపథ్యంలో మచిలీపట్నంలో పండగ వాతావరణం 👉 మచిలీపట్నం చేరుకున్న సీఎం జగన్ 👉 బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కృష్ణాజిల్లా మచిలీపట్నం పర్యటనకు బయల్దేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మచిలీపట్నం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 👉 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 👉 ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది. 👉 తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. 👉 ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్ పోర్టు, ఐదు నాన్ మేజర్ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే.. ► కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ► పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్ భూములను ప్రభుత్వం గుర్తించింది. ► తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది. ► ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ► వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు. 👉 మచిలీపట్నం పోర్టు విశేషాలు.. ► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు ► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు ► బెర్తుల సంఖ్య 4 ► భూసేకరణ.. 1,923 ఎకరాలు ► ఎన్‌హెచ్ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి ► పెడన రైల్వేస్టేషన్ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం ► బందరు కెనాల్ నుండి 11 కి.మీ పైప్‌లైన్ ద్వారా 0.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా ► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్ యాంప్) విద్యుత్ సరఫరా -
బందరు పోర్టు ప్రజలు ఆస్తి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం. పోర్టు కోసం 19ఏళ్ల నుంచి ప్రభుత్వాల వెంటపడ్డాం. పోర్టు ప్రైవేటు చేతికి వెళ్తే ఎన్నటికీ పూర్తికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. అందుకే బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తోందని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. కాగా, పేర్ని నాని ఆదివారం బందరులో మీడియాతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్ఆర్ మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయింది. ఈ భూమి ఉన్నంత వరకు బందరు పోర్టు ప్రజలు ఆస్తి. పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయలేదు. వందకు వంద శాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతోంది. బందరు పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రం మారబోతోంది. నిన్నటి వరకు కలగా ఉన్న పోర్టు నిర్మాణం ఈరోజు సాక్షాత్కారం కానుంది. వంద శాతం ఈ క్రెడిట్ సీఎం జగన్‌కే దక్కుతుంది. తండ్రి సంకల్పాన్ని తనయుడు నెరవేరుస్తున్నాడు. పోర్టు నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం దక్కడం నా అదృష్టం. గతంలో అనేకసార్లు బందరు రావాలని సీఎం జగన్‌కు కోరాను. గత ప్రభుత్వం లాగా మనం మోసం చేయవద్దని సీఎం జగన్ చెప్పారు. పోర్టు పనుల ప్రారంభోత్సవానికే బందరు వస్తానన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై పేర్ని నాని సెటైరికల్ పంచ్‌లు వేశారు. సెల్ఫీ డ్రామాలాడే కమల్‌హాసన్, గుమ్మడి, రేలంగిలను చూడలేకపోతున్నాం. చంద్రబాబు ఆయన ముఠా.. పోర్ట్, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ కట్టాలని ఏనాడైనా ఆలోచేన చేశారా?. మాటలు చెప్పేవారికి .. పనులు చేసే వారికి ఇదే తేడా అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు -
‘బందరు పోర్టుపై టీడీపీ నేతల విచిత్ర ప్రకటనలు’
సాక్షి, విజయవాడ: బందరు పోర్టుపై టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 2014-19 వరకు బందరు పోర్టు ఏ మేరకు నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. శంకుస్థాపన రాయి వేస్తే పోర్టు నిర్మాణం చేసినట్టేనా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీని విమర్శించే ముందు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం హయాంలో టెండర్లు చేజిక్కించుకున్న నవయుగ సంస్థ శంకుస్థాపన చేసి, 8 నెలలైనా పార మట్టి పని కూడా చేయలేదని విమర్శించారు. టీడీపీ తరహాలో శంకుస్థాపన బండ పడేసి మేము వదిలేయం, పనులు చేపడతామని పేర్ని నాని అన్నారు. చదవండి: ‘చంద్రబాబుకు లేని విద్యలేదు.. ఇది కూడా అలానే కనిపెట్టుంటాడు’ -
జగనన్న కోసం జనం.. దారి పొడవునా తరగని అభిమానం (ఫొటోలు)
-
మంచిని ఓర్వలేరు: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో మనం మంచి పనులు చేస్తుండటాన్ని చంద్రబాబుతో కూడిన దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీరి వైఖరి చూస్తుంటే బాధ కలుగుతోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక రాట్నం... ఒక మగ్గం మన దేశం రూపురేఖలను మార్చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి మన స్వాతంత్య్ర పోరాటాన్ని గమనిస్తే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, జాతీయ ఉద్యమాన్ని సంఘటితం చేసిన ఘనత నేతన్నలదేనని గుర్తు చేశారు. మన నేతన్నలు మగ్గాల మీద నేసేది దారాల కలబోత మాత్రమే కాదన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. బతుకుదెరువు కోసం.. మన నేత, చేనేత గొప్ప సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిల్చాయి. అటువంటి మగ్గాన్ని, చేనేతను వేల సంవత్సరాల నుంచి నమ్ముకుని బతుకుదెరువు కోసం నేతన్నలు అవస్థలు పడటాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిచోటా గమనిస్తున్నాం. అద్భుతమైన వస్త్రాలను నేసే నేతన్నల జీవితాలు ఎలా ఉన్నాయో నా 3,648 కి.మీ. పాదయాత్రలో చాలాచోట్ల కళ్లారా చూశా. మాట ప్రకారం వారికి తోడుగా నిలుస్తున్నాం. నేతన్నపై ప్రేమకు నిదర్శనం.. 2019లో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని నా పుట్టిన రోజు నాడే తెచ్చాం. నేతన్న మీద నా ప్రేమకు అది నిదర్శనం. క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలు చొప్పున అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ వరుసగా నాలుగో ఏడాదీ అందచేస్తున్నాం. ఈ ఒక్క పథకం కింద ఇప్పటివరకు ఒక్కో నేతన్న కుటుంబానికి రూ.96 వేల మేర ప్రయోజనాన్ని చేకూర్చాం. గత అప్పుల కింద బ్యాంకులు ఈ డబ్బులను జమ చేయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం. నేతన్నలకు మొత్తం సాయం రూ.2,049.43 కోట్లు ఇవాళ అందించే సాయంతో కలిపితే ఇప్పటివరకూ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ఇది కాకుండా నేతన్నలకు సామాజిక ఫించన్ల ద్వారా మరో రూ.880 కోట్లు, ఆప్కో ద్వారా మరో రూ.393.30 కోట్లు చెల్లించాం. ఇలా మూడేళ్లలో నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం ఏకంగా రూ.2,049.43 కోట్లు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా గతంలో ఏ ఒక్క ప్రభుత్వమైనా నేతన్నలకు ఇంత అండగా నిలబడిందా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. సీఎం వైఎస్ జగన్‌కు నవరత్నాల లోగోతో కూడిన చేనేత వస్త్రాన్ని చూపుతున్న నేతన్న నేతన్నల కుటుంబాలకు దన్ను అప్‌గ్రేడ్ మిషన్స్... ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయంతో మగ్గాలను జాకార్డ్ లిప్టింగ్ మిషన్స్ లాంటి ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం నేతన్నలకు వచ్చింది. తద్వారా కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సులువుగా మగ్గాన్ని నడుపుతున్నారు. 2018–19లో నెలకి రూ.4,680 మాత్రమే ఉన్న నేతన్నల ఆదాయం వైఎస్సార్ నేతన్న నేస్తం దన్నుతో మగ్గాలు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరింది. ఆన్‌లైన్‌తో ప్రపంచానికి పరిచయం.. ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేశాం. ఈ కామర్స్ సంస్ధలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్, పేటీఎం లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను మార్కెటింగ్ చేసే స్థాయిని పెంచాం. మూడేళ్లలో చేసిన మంచి ఇదీ.. శాశ్వత బీసీ కమిషన్... శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్, బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర నేరుగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాం. అధికారంలో.. మొదటి విడత మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిస్తే రెండో విడతలో వారికి 70 శాతం ఇవ్వగలిగాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. శాససనభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ అక్క ఉన్నారు. మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలే. ఎమ్మెల్సీలుగా 32 మందికి అవకాశం కల్పిస్తే వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. కార్పొరేషన్లలో... 98 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీ ఛైర్మన్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 70 పదవులు దక్కాయి. 648 మండల ప్రజా పరిషత్ పదవుల్లో వైఎస్సార్ సీపీ 637 గెలుచుకుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 66.7 శాతం పదవులు ఇచ్చాం. జడ్పీ ఛైర్మన్లు 13కిగానూ 13 వైఎస్సార్సీపీనే గెల్చుకుంది. వీటిలో 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారంటే గతానికి, ఇప్పటికి తేడాను మీరే గమనించండి. సామాజిక న్యాయం... చంద్రబాబు పాలనలో ఎలాంటి సామాజిక న్యాయం ఉందో చెప్పేందుకు ఒక్క ఉదాహరణ చాలు. నాడు విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్, కృష్ణా జడ్పీ ఛైర్మన్‌గా గద్దె అనురాధ, కనకదుర్గమ్మ ఆలయం ఛైర్మన్‌గా యలమంచి గౌరంగబాబు ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇవాళ మన పాలనలో విజయవాడ మేయర్‌గా నా చెల్లి, బీసీ మహిళ భాగ్యలక్ష్మి ఉన్నారు. కృష్టా జడ్పీ ఛైర్మన్‌గా మరో బీసీ చెల్లెమ్మ హారిక ఉన్నారు. దుర్గ గుడి ఛైర్మన్‌గా బీసీ అన్న సోమినాయుడు ఉన్నారు. ఎటు చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. 50 శాతం కేటాయిస్తూ చట్టం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేశాం. అందులోనూ 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 137 ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో అక్కచెల్లెమ్మలు 50 శాతానికి పైగా కనిపిస్తారు. నేతన్న నేస్తం సభకు హాజరైన జనసందోహం అక్కచెల్లెమ్మలకు అండగా.. అక్కచెల్లెమ్మల పేరుతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో శరవేగంగా సాగుతోంది. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందనుకుంటే అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి పెడుతున్నాం. అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత పథకాలతో తోడుగా నిలిచాం. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెన, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మారుస్తున్నాం. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు 86 శాతం ఉన్నారు. నేతన్న నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్ సంతోషించే హృదయాలు కావవి.. ► ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతుంటే జీర్ణించుకోలేని కుట్రదారులు చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నప్పుడు సంతోషపడే హృదయాలు కావవి. మంచి జరుగుతుంటే రాళ్లు వేసే కుళ్లు, కుతంత్రాలను మన కళ్లెదుటే చూస్తున్నాం. ► నాకు వాళ్ల మాదిరిగా ఈనాడు సపోర్టు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, టీవీ 5 అండ ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సహాయం ఉండకపోవచ్చు. కానీ వాళ్లకు లేనిది, నాకు ఉన్నది ఒక్కటే.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నాకు తోడున్నాయి. ► కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడనుకుంటే.. అప్పుడు జనంపై నమ్మకం పెట్టుకుని పరిపాలన చేస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికి వాడుతున్నా. అందుకే నేను చేసిన మంచి మీద నమ్మకం ఉంది. నా నమ్మకం మీమీద ఉంది. ► గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు ముఖ్యమంత్రి పదవిని తన వాళ్ల కోసం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి కోసం వినియోగించారు. రాష్ట్రాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీంతో పాలన సాగించారు. ► ఆ రోజు అప్పులు గమనిస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (అప్పు శాతం పెరుగుదల) 19 శాతం ఉంటే ఈ రోజు 15 శాతం మాత్రమే ఉంది. అంటే ఆరోజు కన్నా ఇవాళ అప్పులు తక్కువగానే చేస్తున్నాం. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగతున్నాడో ఆలోచన చేయండి. అప్పటికి, ఇప్పటికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మార్పు. నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.102 కోట్ల పనులకు పచ్చజెండా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి జోగి రమేష్ దాదాపు రూ.102 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, నీటి సరఫరా, బ్రిడ్జిలు, బీటీ రోడ్ల పనులకు సంబంధించి మొత్తం మంజూరు చేస్తున్నా. ఇంకో శుభవార్త ఏమిటంటే.. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. జిల్లాలో నా తర్వాత కార్యక్రమం బందరు పోర్టుకు శంకుస్ధాపన చేయడమే. అందుకోసం మళ్లీ వస్తా. నేరుగా ప్రజల వద్దకే ఈ సందర్భంగా వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని గమనించిన సీఎం జగన్ తన రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్‌ను నేరుగా వారి వద్దకు పంపి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. -
రెండు నెలల్లో బందరు పోర్టుకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తొలిదశలో రూ.5,834.51 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం చేపట్టనుంది. రైట్స్ సంస్థ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈపీసీ విధానంలో రెండునెలల్లో టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలిదశలో మొత్తం ఆరుబెర్తులు (1 కోల్ బెర్త్, 1 కంటైనర్ బెర్త్, 4 జనరల్ కార్గో బెర్తులు) నిర్మించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం వద్ద సముద్రం లోతు తక్కువగా ఉండటంతో భారీనౌకలు వచ్చేవిధంగా 200 మీటర్ల వెడల్పు, 16.80 మీటర్ల లోతుతో 12.7 కి.మీ. దూరం అప్రోచ్ చానల్ తవ్వనున్నారు. దీంతోపాటు దక్షిణ దిశ వైపు రెండువేల మీటర్లు, ఉత్తరం వైపు 260 మీటర్ల మేర మొత్తం 2.32 కి.మీ. బ్రేక్ వాటర్ పనులు, 44.81 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు, ఇతర ప్రాజెక్టు నిర్మాణపనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు కన్సల్టెంట్‌గా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్)ను ఎంపిక చేశారు. 2 నెలల్లో టెండరు డాక్యుమెంట్లు తయారు చేసి, జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రామకృష్ణారెడ్డి వివరించారు. 2023–24 నాటికి ఏడాదికి 35.12 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించే విధంగా మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందుకు 800 నుంచి వెయ్యి ఎకరాలు అవసరమవుతుంది. మరో 155 ఎకరాలు పోర్డు బేసిన్, డ్రెడ్జింగ్ కోసం వినియోగిస్తారు. మిగిలిన 2వేల ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు. -
ముహూర్తమే తరువాయి !
జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు కెనరా బ్యాంక్ ముందుకు రాగా.. తాజాగా రూ.10,900 కోట్ల అంచనాతో ఆరు దశల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేసేందుకు శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కీలకమైన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త సంవత్సర ఆరంభంలోనే పోర్టు నిర్మాణ పనులకు పునాది రాయి పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. సాక్షి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బందరు పోర్టు నిర్మాణ పనులకు పునాది రాయి వేసేందుకు సమయం సమీపించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టయిన బందరు పోర్టును 5,324 ఎకరాల్లో నిర్మించాలని తొలుత ప్రతిపాదించారు. అప్పట్లోనే శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆయన హఠాన్మరణం తర్వాత ఈ ప్రాజెక్టు అటకెక్కింది. వైఎస్సార్ హయాంలో ఈ పోర్టు నిర్మాణానికి 5వేల ఎకరాలు ఎందుకని నానాయాగీ చేసిన చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు, పెడన మండలాల్లోని 21 గ్రామాల పరిధిలో ఏకంగా 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. పోర్టు నిర్మాణం పేరిట నోటిఫై చేసిన 2,278.32 ఎకరాలు, పారిశ్రామికీకరణ పేరిట నోటిఫై చేసిన 12,144.86 ఎకరాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం డీ నోటిఫై చేసింది. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,730.22 ఎకరాల ప్రభుత్వ భూములు, 305.62 ఎకరాల ఎసైన్డ్ భూముల్లో పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. మరో 900 ఎకరాల్లో కాంకర్ ఐఎల్‌ఎంజెడ్, ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ రోడ్ కమ్ రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం.. పోర్టు నిర్మాణం పూర్తయితే కనీసం రూ. 5,500 కోట్ల నుంచి రూ. 9వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కనీసం 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏడాదికి కనీసం 18–20 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరుగుతుందని, తద్వారా రూ.200కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. పోర్టు నిర్మాణానికి రూ.4వేల కోట్ల వరకు సమకూర్చేందుకు ఇటీవలే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషి ఫలితంగా కెనరా బ్యాంక్ ముందు కొచ్చిన విషయం తెలిసిందే. తొలిదశ పనులకు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉండవు. ఈ నిధులతో బెర్త్‌ల నిర్మాణం, రోడ్ కమ్ రైల్ కనెక్టవిటీ, అప్రోచ్ రోడ్స్, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణంపై డీపీఆర్ తయారు చేసే బాధ్యతను కేంద్ర సంస్థయిన రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్‌కు (రైట్స్) అప్పగించిన విషయం తెలిసిందే. డీపీఆర్ జనవరి నెలాఖరు కల్లా ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. -
త్వరలోనే బందరు పోర్టు పనులు ప్రారంభం
సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం): బందరు పోర్టు పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని, నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోర్టు నిర్మాణం నిలిచిపోతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. నాలుగైదు బెర్త్‌లు నిర్మించేందుకు ఎక్కువ నిధులు కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. కంటైనర్ కార్పొరేషన్ సంస్థ పోర్టు నిర్మాణంలో కలిపి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన వివరించారు. త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించి ఆర్థిక అభ్యంతరాలను తొలగించనున్నామని తెలిపారు. అలాగే స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. డ్యామ్‌లు నిండుతున్నాయి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే దేవుని చలువతో డ్యామ్‌లు అన్ని నీటితో కళకళలాడుతున్నాయని ఎంపీ బాలశౌరి అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిని తర్వాత పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండో పంటకు కూడా నీటి సమస్య రాకుండా రైతులు సంతోషంగా ఉండేలా చేస్తామని చెప్పారు. పంటలకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఆరు లైన్ల రహదారులకు నూతన ప్రతిపాదనలు.. కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం ఆరు లైన్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ప్రతిపాదనలు అందించినట్లు ఎంపీ తెలిపారు. గుండుగొలను నుంచి కలపర్రు వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 505.40 కోట్లు, కలపర్రు నుంచి చినఅవుటుపల్లి వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 512.43 కోట్లు, చినఅవుటుపల్లి – గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లకు రూ. 752.15 కోట్లు, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు మధ్యలో కృష్ణా నది ఐకానిక్ బ్రిడ్జితో సహా 17.8 కిలోమీటర్లకు రూ. 1,215.19 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు బూరగడ్డ రమేష్‌నాయుడు, ఉప్పాల రాంప్రసాద్, రాజులపాటి అచ్యుతరావు, తిరుమాని శ్రీనివాసరావు, బండారు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
ట్విట్టర్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
-
‘అధికారం పోయినా బలుపు తగ్గలేదు’
సాక్షి, విజయవాడ : చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పబ్లిసిటీ కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్ల హక్కుల్ని వదిలేసి.. రాత్రికిరాత్రే పారిపోయి వచ్చింది చంద్రబాబు, లోకేష్ కాదా అని ప్రశ్నించారు. ‘2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. రాసి పెట్టుకోండి’అని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఏం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల పేరుతో దండుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయినా వారి బలుపు తగ్గలేదని ఎద్దేవా చేశారు. జనం ఛీకొట్టినా.. మారరా..! దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నాని హితవు పలికారు. జనం ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పురావడం లేదని అన్నారు. రాజకీయంగా బతికున్నాని చెప్పుకోవడానికే బందరు పోర్టుపై కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు, ప్రొక్లెయిన్లు, జేసీబీ, బోర్వెల్ డ్రిగ్గింగ్ మిషన్లతో పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు. ఆ మిషన్లన్నీ బందరు నుంచి అద్దెకు తీసుకొచ్చినవేని చెప్పారు. పోర్టుకు పర్యావరణ అనుమతులు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేచ్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. బందరు పోర్టు హామీని కూడా సీఎం జగన్ నిలబెట్టుకుంటారని అన్నారు. -
ట్రాలీలో ఓడను తెచ్చి ఊరేగించారు : జోగి రమేశ్
సాక్షి, అమరావతి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తుచేశారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్ పోర్టు నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. ‘బందరు పోర్టు నిర్మించి కొన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు. బందరు పోర్టుకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. పైగా పోర్టు నిర్మాణానికి 28 గ్రామాల్లో 33 వేల ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఓడరేవు నిర్మాణానికి ఇన్ని ఎకరాలు ఎందుకని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా బాధిత గ్రామాల తరఫున పోరాటం చేశారు. దీంతో స్పందించిన చంద్రబాబు సర్కార్ ఆ భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తామని చెప్పింది. అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు బందరు పోర్టు నిర్మాణం జరిగిపోయిందనే రీతిలో హడావుడి చేసింది. తీరా చూస్తే ట్రాలీలో ఓడను తెచ్చి పరిసర గ్రామాల్లో ఊరేగించార’ని తెలిపారు. అలాగే చంద్రబాబు సర్కార్ తీసుకువచ్చిన బలవంతపు భూ సేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని జోగి రమేశ్ ప్రభుత్వాన్ని కోరారు. సాధ్యమైనంత త్వరలో బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై అంతకు ముందు మాట్లాడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. బందరు పోర్టు నిర్మాణం కోసం మహానేత వైఎస్సార్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని.. అందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని తెలిపారు. పోర్టు కోసం నాలుగువేల ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. కానీ చంద్రబాబు అవసరానికి మించి భూ సేకరణ చేపట్టారని మండిపడ్డారు. పైగా ఎన్నికలకు ముందు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి పోర్టు నిర్మాణం జరుగుతుందనే రీతిలో ఆర్భాటం చేశారని విమర్శించారు. బలవంతపు భూ సేకరణ చట్టాన్ని డీ నోటిఫికేషన్ చేయాలని కోరారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. బందర్ పోర్టు నిర్మాణ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బందర్ పోర్టు భూ సేకరణ చట్టాన్ని డీ నోటిఫికేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐదేళ్లలో తప్పకుండా బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని తెలిపారు. -
పోర్టు.. కథ ఏమైనట్టు!
సాక్షి, మచిలీపట్నం: బందరు పోర్టు కథ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పోర్టు భూ సేకరణ అంశం ఓ కొలిక్కి వచ్చిందని, భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రైవేటు భూములు కొనుగోలు చేస్తామని, బ్యాంకు ద్వారా మంజూరయ్యే రుణంతో పరిహారం పంపిణీ చేస్తామని గత కొన్ని నెలల క్రితం పాలకులు ప్రకటించారు. అతీగతి లేకుండా పోయింది. ఇటీవల ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో 30 వేల ఎకరాలకు 2015లో వెలువరించిన భూ సేకరణ నోటిఫికేషన్ ఉపసంహరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఆ అంశం కూడా ప్రస్తుతం మరుగున పడింది. వెరసి పోర్టు కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పరిహారంపై రైతుల అనాసక్తి.. బందరు పోర్టు భూ సేకరణ అంశం మరుగున పడింది. భూమి కొనుగోలు పథకం ద్వారా పోర్టు నిర్మాణానికి 5,300 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరించాలని లక్ష్యం నిర్దేశించగా.. 3,000 ఎకరాల ప్రభుత్వ భూమి కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. మిగిలిన 2300 ఎకరాల ప్రైవేటు భూమి సేకరణలో ఆది నుంచీ ఆపసోపాలు తప్పడం లేదు. అందులో 700 ఎకరాలకు సంబంధించి రైతులు ముడా అధికారులు భూములు ఇస్తున్నట్లు ఒప్పంద పత్రాలు సమర్పించారు. ఇక మిగిలిన 1,600 ఎకరాల భూములు సేకరించేందుకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. తొలుత ఎకరానికి రూ.22 లక్షలు పరిహారంగా అందజేస్తామన్నారు. ఇదే విషయమై రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు ముడా అధికారులు గ్రామాల్లో పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా ఆందోళనలు, ఎదురీతలే మిలిలాయి. తాము రూ.32 లక్షలు అయితే భూములు ఇచ్చే విషయం ఆలోచిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ప్రకటించి నెలలు గడుస్తున్నా రైతులతో చర్చించి భూములు సేకరించే ప్రక్రియ మొదలు చేసిన దాఖలాలు లేవు. క్యాంప్‌బెల్ పేట గ్రామం మొత్తం కనుమరుగు కానుండటంతో గ్రామాన్ని బందరు పట్టణంలోని ఓ ప్రాంతంలో పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు. ఆ ప్రక్రియ ఒక్క అడుగూ ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఉపసంహరణ ఊకదంపుడేనా? బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల నిమిత్తం 2015 ఆగస్టు 31న భూ సేకరణ, 2016 సెప్టెంబర్ 18న భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 33 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో 20,856 ఎకరాలు ప్రభుత్వ, 12,144 ఎకరాల ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా రైతులు తమ భూములపై ఉన్న హక్కులు పూర్తిగా కోల్పోయారు. రుణాలు, క్రయ, విక్రయాలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే రెండు మాసాల క్రితం మంత్రి కొల్లు రవీంద్ర 12,144 ప్రైవేలు భూములకు సంబంధించి నోటిఫికేషన్ ఉపసంహరిస్తామని ప్రకటించారు. కలెక్టర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం వారంలోగా రైతులకు నోటిఫికేషన్ నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. రెండు మాసాలు గడుస్తున్నా అతీ గతీ లేదు. ఎప్పుడు విముక్తి కల్పిస్తారా? ఎప్పుడు తమ భూములపై తమకు పూర్తిస్థాయి హక్కులు రానున్నాయన్న ఆందోళన 5 వేల మంది రైతుల్లో నెలకొంది. నెలాఖరు ముగియనున్న గడువు.. పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం జారీ చేసి భూ సేకరణ నోటిఫికేషన్ గడువు ఈ నెలాఖరుకు ముగియనుంది. యథావిథిగా ఎవరు ఉపసంహరించకపోయినా దానంతట అదే నిర్వీర్యం కానుంది. ఈ విషయం తెలిసిన పాలకులు తాము ఏదో రైతులకు మేలు చేస్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేశారు. రెండు నెలల క్రితం సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర వారంలోగా నోటిఫికేషన్ ఎత్తివేస్తామని గొప్పలు చెప్పారు. కానీ నేటికీ అమలైన మార్గం మాత్రం చూపలేదు. శంకుస్థాపన ఎప్పుడో? పోర్టు పనులకు ఆగస్టు మాసంలో శంకుస్థాపన చేస్తామన్న పాలకులు ఆగస్టు మాసం ముగియనున్నా ఆ అంశంపై ఉలుకూ పలకు లేకుండా వ్యవహరిస్తున్నారు. రూ.1700 కోట్లకు పైగా బ్యాంకు రుణం మంజూరవుతుందని చేస్తున్న ఉపన్యాసాలు నెలలు గడుస్తున్నాయి. రుణం మంజూరు కాలేదు, పనులు ప్రారంభించలేదు. దీన్ని బట్టి చూస్తే అసలు పోర్టు పనులు ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అన్న అనుమానాలు ప్రజల్లో వెలువడుతున్నాయి. -
వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం విమానాశ్రయంలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డుమార్గంలో మచిలీపట్నం బైపాస్ మీదుగా బుద్దాలవారి పాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడుతారు. అనంతరం అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. -
నేడు కృష్ణా జిల్లాకు జగన్
బందరు పోర్టు బాధితులతో ముఖాముఖి సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పచ్చటి పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను జగన్ సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో భూములు కోల్పోనున్న బాధిత రైతులతో ఆయన మాట్లాడతారని, వారినుద్దేశించి బహిరంగసభలో కూడా ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జగన్ గురువారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మచిలీపట్నం బైపాస్ మీదుగా బుద్దాలవారిపాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పులివెందులలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన సాక్షి, కడప : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బుధవారం ప్రజలతో మమేకమయ్యారు. రెండో రోజు కూడా స్వగృహంలో ఉదయం పలువురు రైతులు, కార్యకర్తలు, నేతలు, మహిళలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలను జగన్‌కు విన్నవించారు. జగన్ పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. -
నేడు కృష్ణా జిల్లాకు వైఎస్ జగన్
-
రేపు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ: కృష్ణా జిల్లాలో గురువారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. బుద్దాలపాలెం, కోనలో రైతులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అక్కడి స్థానికులు గత కొంత కాలంగా బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. -
బందరు పోర్టుకు సర్వే పూర్తి : మంత్రి రవీంద్ర
విజయవాడ : రాజధానికి దగ్గరలో ఉన్న బందరు పోర్టు నిర్మాణానికి కావాల్సిన స్థల సర్వే పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొత్తం 5300 ఎకరాల ప్రైవేటు, ప్రభుత్వ భూమలను సర్వే చేసినట్లు తెలిపారు. ఈ పోర్టు నిర్మిస్తే రాజధాని ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, వారికి అనుమానాలుంటే నివృత్తి చేసి ముందుకు సాగుతామన్నారు. మచిలీపట్నంలో మెరైన్ అకాడమీని 300 ఎకరాల్లో నిర్మిస్తామని చెప్పారు. అక్కడే 25 ఎకరాల్లో క్రీడా స్టేడియం నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి జరిగే ఎక్‌పోర్టు, ఇంపోర్ట్ అంతా మచిలీపట్నం పోర్టు నుంచి చేస్తే లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి నల్గొండలో మెరైన్ హబ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మంత్రి రవీంద్ర తన శాఖకు సంబంధించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే తమిళనాడులోని లిక్కర్ పాలసీపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వచ్చే వారం కేరళలోని లిక్కర్ పాలసీపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీల్లోని మెరుగైన విధానాలను ఏపీలో అమలు చేస్తామన్నారు.