కృష్ణా జిల్లా: మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు పడింది. నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులకు మాజీమంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన పేర్ని నాని.. ‘ సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ పనులను సమాంతరంగా పూర్తి చేస్తాం.
నాలుగు బెర్త్‌ల నిర్మాణానికి సంబంధించి సాయిల్ టెస్టులు జరుగుతున్నాయి. మొన్నటి వరకూ దావాలతో ఇబ్బంది పెట్టారు. అన్ని ఇబ్బందులను పోర్టు పనులు ప్రారంభించాం. 26 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేస్తాం’ అని అన్నారు.
కాగా, మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుంది.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్లలోపే మరో నాలుగు పోర్టుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల్లో పనులు శరవేగంగా జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక ఈ జాబితాలో మచిలీపట్నం పోర్టు కూడా చేరింది.
Comments
Please login to add a commentAdd a comment