CM Jagan Inaugurates Machilipatnam Port Works Live Updates - Sakshi
Sakshi News home page

బందరు పోర్టు చిరకాల స్వప్నం: సీఎం జగన్‌

Published Mon, May 22 2023 8:35 AM | Last Updated on Mon, May 22 2023 4:53 PM

CM Jagan inaugurates Machilipatnam Port Works Live Updates - Sakshi

Updates

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • బందరుతో సముద్ర వర్తకానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది
  • ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉంది
  • నెరవేరని ఈ కల ఇప్పుడు నెరవేరుతోంది
  • ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారుస్తున్నాం
  • అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేశాం
  • అన్ని అనుమతులు తీసుకొచ్చాం
  • ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తిచేశాం
  • పోర్టు నిర్మాణ పనులకు టెండర్లు పూర్తిచేసిన, ఆపనులు ప్రారంభించాం
  • 5156 కోట్లతో నాలుగు బెర్తులు రాబోతున్నాయి
  • 35 మిలియన్‌ టన్నుల కెపాసిటీతో స్టార్ట్‌ అవుతుంది
  • ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ… 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది
  • పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాను కూడా నిర్మిస్తున్నాం
  • 6.5 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారిని నిర్మిస్తున్నాం
  • 7.5 కిలోమీటర్ల గుడివాడ- మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నాం
  • బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నాం
  • అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థకు పోర్టు మంచి ఆధారంగా ఉంటుంది
  • కృష్ణా జిల్లా చరిత్రను ఈ పోర్టు మారుస్తుంది
  • ఈ పోర్టు వల్ల మన రాష్ట్రం మాత్రమే బాగుపడ్డం కాకుండా.. వ్యాపారాలు బాగుపడతాయి

  • మచిలీపట్నం పోర్టు వల్ల పక్క రాష్ట్రాలకు ఉపయోగం
  • ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ ఉపయోగం
  • పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి
  • డిగ్రీలు పూర్తిచేసుకున్న మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి
  • పోర్టు నిర్మాణంలో గతంలో అనేక అడ్డంకులు వచ్చాయి
  • పోర్టు ఇక్కడ రాకూడదని తపన, తాపత్రయ పడ్డాడు చంద్రబాబు
  • 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చంద్రబాబు చేశాడు:
  • దీనివల్ల పోర్టు అడగరని చంద్రబాబు ఇలా చేశాడు
  • ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే.. అందరూ అమరావతిలో తాను బినామీగా పెట్టుకున్న భూములను విపరీతంగా అమ్ముకోవచ్చని తీరని ద్రోహం చేశాడు
  • పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం
  • ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పాను
  • రైతులందరి సంతోషం మధ్య ఆ భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం
  • ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నాం
  • 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి
  • పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి.. మచిలీపట్నంలో

  • మన ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి
  • గతంలో బందరు ముఖ్యపట్టణమైనా.. కలెక్టరుతోపాటు ఏ ఒక్క అధికారీ ఇక్కడ ఉండలేదు:ప్రజలకు మంచిచేస్తూ ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్‌ మాత్రమే కాదు, మొత్తం యంత్రాంగం జిల్లాలో ఉండేట్టుగా మచిలీపట్నాన్ని జిల్లాకేంద్రంగా చేశాం
  • జిల్లాల విభజన వల్ల ఇది సాధ్యమైంది
  • మరో మూడు నెలల్లో బందరు మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి
  • అవనిగడ్డ, పెడన, పామర్రు, కైకలూరు ప్రాంతాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి
  • ఏ సమయంలో నైనా మత్స్యసంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ పనులు కూడా జరుగుతున్నాయి
  • 60శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి
  • నాలుగు నెలల్లో ఇదికూడా అందుబాటులోకి వస్తోంది
  • ఇమిటేషన్‌ జ్యుయలరీ తయారీకి మద్దతుగా… పాదయాత్రలో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా రూ.7.60 యూనిట్‌ ధరను.. రూ.3.75లకు తగ్గించాం
  • దాదాపు 45వేలమందికి బతుకుతున్న ఈపరిశ్రమకు మంచిచేశాం
  • ఈ జిల్లా ముఖ్యపట్టణంగా ఎదగడమే కాకుండా.. భారీ స్థాయిలో వర్తకానికి, వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి మచిలీపట్నం కేరాఫ్ అడ్రస్‌గామారబోతోంది
  • రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి మన ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది
  • 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 2025-2026 నాటికి అదనంగామరో 110 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నాం:
  • 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఉన్న పోర్టులు నాలుగు పోర్టులు అయితే.. అక్షరాల రూ.16వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో జోరుగా అడుగులు పడుతున్నాయి
  • కాకినాడ గేట్‌వే ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడ్డాయి
  • ఒక్కో పోర్టులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయి
  • పోర్టు ఆధారిత పరిశ్రమల కారణంగా లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలకు వస్తాయి
  • మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే.. గొప్ప కార్యక్రమం జరగబోతోంది
  • గతంలో చరిత్రలోఎప్పుడూ చూడని విధంగా.. మన ప్రభుత్వంలో అడుగులు ముందుకేశాం
  • ప్రపంచస్థాయి ప్రమాణాలతో  ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి
  •  ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను కూడా నిర్మిస్తున్నాం
  • మరోవంక పేదల సంక్షేమానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలూ చేస్తున్నాం
  • పేదరికాన్ని సమూలంగా తీసివేయాలని అక్షరాల రూ.2.10లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం
  • నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం
  • లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం

  • నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం
  • ప్రజలకు అందించే సేవల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
  • సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా పల్లె పల్లెల్లో ప్రజల ముంగిటకే సేవలు తీసుకు వచ్చాం
  • ప్రజల ప్రభుత్వంగా మార్పులు తీసుకు వచ్చాం
  • ఇప్పటికే 30 లక్షల ఇళ్లపట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో వారికి అందించాం
  • ఇలా రూ.1.5 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టాం
  • అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించాం
  • కాని ఆ యజ్ఞానానికి రాక్షసులు అడ్డు పడ్డారు
  • టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోంది
  • దోచుకోవడం… పంచుకోవడం.. వీరి పని
  • టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరికి తోడు ఒక దత్తపుత్రుడు కలిశాడు
  • అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్‌ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు
  • బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు
  • ఇందులో పేదల వర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి
  • రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలంట
  • అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్‌ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట
  • ఇంతకన్నా.. సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా?
  • ఇలాంటి మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధంచేస్తున్నాం
  • వారి వికృతఆలోచనలకు మద్దు ఇవ్వగలమా?
  • పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలి

  • ఈ నెల 26l అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగాచేస్తున్నాను
  • పేదలంటే చంద్రబాబుకు చులకన 
  • ఎస్సీలు కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాబు అన్నాడు
  • బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు
  • కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు ఈ బాబు
  • మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు ఈ చంద్రబాబు
  • మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు చంద్రబాబు
  • తాను కనీసం ఒక్క సెంటైనా కూడా పేదవాడికి ఇచ్చిన పోలేదు చంద్రబాబు
  • ఒక్క ఇళ్లస్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు
  • పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు
  • అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని… సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు
  • రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు
  • ఈ చంద్రబాబుతోపాటు.. ఈ దుష్టచతుష్టయం.. ఈ గజదొంగల ముఠా
  • అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు
  • పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు
  • కాని మనం ఇస్తే.. వాటిని స్మశానంతో పోలుస్తాడు
  • ఇలాంటి చంద్రబాబుకు అవగాహనైనా ఉందా?
  • కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు
  • కాని చంద్రబాబుకు మానవత్వం లేదు
  • ఇలాంటి కార్యక్రమాన్ని దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు
  • మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు
  • పలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వారిది
  • వారి ఆలోచనలన్నీ.. వారి కుళ్లు, కుతంత్రాలు అన్నీ ఒక్కటే
  • ఒక్క దత్తపుత్రుడ్ని, ఎల్లోమీడియాను మాత్రం నమ్ముకుంటారంట
  • మంచిచేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ. .ఎన్నికల్లో గెలవడమే కష్టమట
  • మీ బిడ్డ పాలనలో మీకు జరిగి ఉంటే.. మీరే సైనికులుగా తోడుగా నిలవండి

పేర్ని నాని కామెంట్స్‌

► బందరు అభివృద్ధికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు

► బందరకు సీఎం జగన్‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు

► పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు

► బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు

► నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు

► బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు

► బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం

► బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు

► రూ. 197 ‍కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారు

► బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు

► బందరుకు మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ది

► 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నారు

► ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు

► బందరులో గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌లను నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌ది

► సీఎం జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే

► 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా?

ఎంపీ బాలశౌరి కామెంట్స్‌

► బందరు పోర్టు శతాబ్దాల కల

► రామాయపట్నం, భావనపాడు పోర్టులతో లక్షలాది మందికి ఉపాధి

► నిజాయితీగా పోర్టు పనులు ప్రారంభించిన నాయకుడు సీఎం జగన్‌

► బందరు పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది

👉బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ 

👉పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయల్దేరిన సీఎం జగన్‌

👉పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం జగన్ 

👉 సీఎం జగన్‌ బహిరంగ సభ నేపథ్యంలో.. ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. జననేతకు హృదయపూర్వక స్వాగతమంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు కొందరు.

👉 మచిలీపట్నం(బందరు) ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణ నెలకొంది. సోమవారం ఉదయమే తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్‌ ఆవిష్కరించారాయన. ఇక.. సీఎం జగన్‌ను చూసేందుకు జనం అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లను చూసి ఆయన అభివాదం చేశారు. కాసేపట్లో బహిరంగ సభకు చేరుకుని ఆయన ప్రసంగించనున్నారు.

👉బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్‌

👉తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులు ప్రారంభించిన సీఎం జగన్‌

👉గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం జగన్‌

👉సీఎం పర్యటన నేపథ్యంలో మచిలీపట్నంలో పండగ వాతావరణం

👉 మచిలీపట్నం చేరుకున్న సీఎం జగన్‌

👉 బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు  కృష్ణాజిల్లా మచిలీపట్నం పర్యటనకు బయల్దేరారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. 
అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ మచిలీపట్నం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

👉 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.


👉 ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. 
సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది.

👉 తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్‌ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. 
ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్‌ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు.


👉 ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. 

ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్‌ పోర్టు, ఐదు నాన్‌ మేజర్‌ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే..

► కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

► పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది. 

► తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది.

► ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 

► వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

► ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు.


👉 మచిలీపట్నం పోర్టు విశేషాలు..
► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు
► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్‌ టన్నులు
► బెర్తుల సంఖ్య 4
► భూసేకరణ.. 1,923 ఎకరాలు
► ఎన్‌హెచ్‌ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి
► పెడన రైల్వేస్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం
► బందరు కెనాల్‌ నుండి 11 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా 0.5 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి సరఫరా
► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్‌ యాంప్‌) విద్యుత్‌ సరఫరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement