ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పచ్చటి పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను జగన్ సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో భూములు కోల్పోనున్న బాధిత రైతులతో ఆయన మాట్లాడతారని, వారినుద్దేశించి బహిరంగసభలో కూడా ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.