కేంద్ర బృందం సభ్యులు
బందరు హార్బర్‌ను పరిశీలించిన బృందం
సాక్షి, మచిలీపట్నం: బాధ్యతాయుతమైన, స్థిరమైన ఆక్వాకల్చర్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం బృందం సభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులోని గిలకలదిండిలో నిరి్మస్తున్న హార్బర్‌ను ఆదివారం కేంద్ర బృందం ప్రాజెక్టు ఇండియా సహాయ ప్రతినిధి డాక్టర్ కొండ చెవ్వ, బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్, కో–ఆర్డినేటర్ సీమ భట్, లీడ్ టెక్నికల్ స్పెషలిస్ట్ మురళీధరన్, ఆక్వా కల్చర్ స్పెషలిస్ట్ విష్ణుభట్, ఫైనాన్స్ స్పెషలిస్టు నీలకంఠ మిశ్రా, ఎని్వరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ నీనా కోషి, సేఫ్ గార్డ్ స్పెషలిస్టు సలోమ్ ఏసుదాస్ పరిశీలించారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ (ఎఫ్‌ఏఓ) ఆధ్వర్యంలో వాతావరణ పరిస్థితులు, మత్స్యకారుల ఇబ్బందులు, చేపల నిల్వ, ప్యాకింగ్, నీరు, ఉప్పు శాతం, భూమి, ఇతర నమూనాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వాకల్చర్‌పై దృష్టి పెడుతుందన్నారు. మెరుగైన, సైన్స్ ఆధారిత ఆక్వాకల్చర్ నిర్వహణ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ స్కేప్ విధానాలు అవలంబించాలని, రసాయన వినియోగం తగ్గించి స్థిరమైన ఆక్వాను ఉత్పత్తి అయ్యేలా చూడాలన్నారు.
మన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగమతి చేస్తే.. రిజెక్టు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర బృందంతో భూగర్భ వనరులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. బందరును ఆక్వాహబ్‌గా మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోలార్ పవర్డ్ బోట్స్ సాంకేతికను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్ డి.కె.బాలాజీని కలిసి, హార్బర్ వద్ద సేకరించిన అంశాలను ఆయనకు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment