మచిలీపట్నం: మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే సూపరింటెండెంట్ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. నవంబర్‌లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక రైలు (07573) బందరులో బయలుదేరి రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, డోర్నకల్, వరంగల్, ఖాజీపేట్ స్టేషన్లలో ఆగుతుంది.
తిరిగి రైలు (07574) సికింద్రాబాద్‌లో రాత్రి 11.55 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, గుడివాడ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నవంబర్‌లో మాత్రమే ఈ రైలును నడుపుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.
మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు
Published Thu, Nov 4 2021 4:40 AM | Last Updated on Thu, Nov 4 2021 4:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment