హిందీ భాషతోనే జాతీయ సమైక్యత
హిందీ భాషతోనే జాతీయ సమైక్యత
Published Sat, Sep 24 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
కేయూక్యాంపస్ : హిందీభాష భారతీయ ప్రజల సమైక్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని కాకతీయ యూనివర్సిటీ హిందీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ చిలక సంజీవ అన్నారు. శుక్రవారం హిందీభాషాదినోత్సవం సందర్భంగా హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందీ భారతీయ రాజ్యభాష అని, దేశంలో అత్యధికులు హిందీ భాషనే మాట్లాడుతారని ఆయన పేర్కొన్నారు. హిందీభాషలో భారతీయ సంస్కృతి ఇమిడి ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామానుజరావు మాట్లాడుతూ హిందీభాషతో దేశవ్యాప్తంగా ఎన్నోరకాల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మార్కులు ముఖ్యం కాదని విషయ పరిజ్ఞానం పెంచుకోవటం ముఖ్యమన్నారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుకర్, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, హిందీ విభాగ్ అధ్యాపకురాలు డాక్టర్ సరస్వతి, డాక్టర్ సుజాత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ ఫరాఫాతిమా పాల్గొన్నారు.
Advertisement