'సాక్షి భవిత' ఆధ్వర్యంలో గ్రూప్స్ పై సదస్సు
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో 'సాక్షి భవిత' ధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సుకు నిరుద్యోగులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గ్రూప్స్‌పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా పలువురు విద్యారంగ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణ చరిత్రకు చోటు కల్పించడం శుభ పరిణామంగా అభివర్ణించారు. విద్యార్థులు స్థానిక అంశాలతోపాటు జాతీయ అంశాలపై అవగాహన కల్పించుకుంటే విజయావకాశాలు మెరుగవుతాయని సూచించారు.