సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు ఈనెల 8న
కరీంనగర్‌లో ఏర్పాటు.. ప్రవేశం ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడి అవకాశాలు అసంఖ్యాకంగా ఉన్నా యి. మరి ఏ సమయంలో ఎందులో పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయి? ఇలా ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల నిర్వహణ, స్టాక్ మార్కెట్స్ వంటి సమస్త సమాచారాన్ని అందించేందుకు ‘సాక్షి–మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సు’ ఈ సారి కరీంనగర్‌లో జరుగుతోంది. ఈ నెల 8న కరీంనగర్‌లో ఇన్‌కం టాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జరగనుంది.
ఈ సదస్సులో సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, కొటక్ మ్యూచువల్ ఫండ్ జనరల్ మేనేజర్ తిరుమల్ రెడ్డి, కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జోనల్ బ్రోకింగ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ వింజమూరి వక్తలుగా పాల్గొంటారు. ప్రవేశం ఉచితం. సభ్యత్వ నమోదు కోసం 95055 55020 నంబర్‌లో సంప్రదించవచ్చు.