Investors Club
-
సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు ఈనెల 8న
కరీంనగర్లో ఏర్పాటు.. ప్రవేశం ఉచితం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడి అవకాశాలు అసంఖ్యాకంగా ఉన్నా యి. మరి ఏ సమయంలో ఎందులో పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయి? ఇలా ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల నిర్వహణ, స్టాక్ మార్కెట్స్ వంటి సమస్త సమాచారాన్ని అందించేందుకు ‘సాక్షి–మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సు’ ఈ సారి కరీంనగర్లో జరుగుతోంది. ఈ నెల 8న కరీంనగర్లో ఇన్‌కం టాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జరగనుంది. ఈ సదస్సులో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, కొటక్ మ్యూచువల్ ఫండ్ జనరల్ మేనేజర్ తిరుమల్ రెడ్డి, కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జోనల్ బ్రోకింగ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ వింజమూరి వక్తలుగా పాల్గొంటారు. ప్రవేశం ఉచితం. సభ్యత్వ నమోదు కోసం 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు. -
మీరు సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్లో చేరారా?
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వివిధ పొదుపు సాధనాల్లో పెట్టుబడులు చేసేవారికోసం తాను నిర్వహిస్తున్న ‘ఇన్వెస్టర్స్ క్లబ్’లో చేరినవారికి ‘సాక్షి’ మరిన్ని ప్రయోజనాలు అందజేస్తోంది. ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట నిర్వహిస్తున్న సదస్సులకు ఉచితంగా హాజరయ్యే అవకాశం కల్పిస్తున్న సాక్షి... అందులో పాల్గొన్న వారికి ఆ తరవాత కూడా వివిధ సూచనలు అందజేసే బాధ్యతను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు వారందరికీ మార్కెట్ పరిస్థితులను అప్డేట్ చేస్తూ న్యూస్‌లెటర్ పంపిస్తోంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సుల వివరాలు, తేదీల వంటివి కూడా పంపిస్తోంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలాలను పొందాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సేవలకు సంబంధించి మరింత సమాచారానికి 9505555020 నంబర్‌కు ఉద యం 10 సాయంత్రం 6 మధ్య కాల్ చేయొచ్చు. investorsclub @sakshi.com కు ఈ మెయిల్ కూడా పంపవచ్చు. -
సాక్షిమైత్రి ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు విశేష స్పందన
-
’సాక్షి మైత్రిఇన్వెస్టర్స్ ’మదుపరుల అవగాహన సదస్సు
-
సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్
-కడపలో తొలి అవగాహన సదస్సు హైదరాబాద్ : ఆర్థిక విషయాలపై పాఠకులకు అవగాహన కల్పించడంలో భాగంగా 'సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్' ఆదివారం కడపలో తొలి అవగాహన సదస్సు నిర్వహించనుంది. ఈ క్లబ్లో సభ్యులుగా చేరిన వారికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, బీమా, పిల్లల చదువు, వివాహం, సొంతింటి కల నెరవేర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడం ఎలా.. వంటి వ్యక్తిగత ప్రణాళికలను ఏ విధంగా రూపొందించుకోవాలనే విషయాలపై ఆర్థిక నిపుణులు సూచనలు అందిస్తారు. ఈ క్లబ్లో చేరిన వారి ఆర్థిక పరమైన సందేహాలు నివృత్తి చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి సదస్సు కడపలో ఏప్రిల్ 19న ఆదివారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్లో సభ్యత్వం పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు 9505555020 అనే నెంబర్‌కు ఫోన్ చేసి పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వేదిక : మయూరా గార్డేనియా, నెహ్రూ పార్క్ ఎదురుగా, కో-ఆపరేటివ్ కాలనీ సమయం : సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తేది : ఏప్రిల్ 19, ఆదివారం ప్రవేశం : ఉచితం