సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ | sakshi mytri investors club in ysr kadapa distirict | Sakshi
Sakshi News home page

సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్

Published Sat, Apr 18 2015 1:12 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ - Sakshi

సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్

-కడపలో తొలి అవగాహన సదస్సు
హైదరాబాద్ : ఆర్థిక విషయాలపై పాఠకులకు అవగాహన కల్పించడంలో భాగంగా 'సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్' ఆదివారం కడపలో తొలి అవగాహన సదస్సు నిర్వహించనుంది. ఈ క్లబ్‌లో సభ్యులుగా చేరిన వారికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, బీమా, పిల్లల చదువు, వివాహం, సొంతింటి కల నెరవేర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడం ఎలా.. వంటి వ్యక్తిగత ప్రణాళికలను ఏ విధంగా రూపొందించుకోవాలనే విషయాలపై ఆర్థిక నిపుణులు సూచనలు అందిస్తారు. ఈ క్లబ్‌లో చేరిన వారి ఆర్థిక పరమైన సందేహాలు నివృత్తి చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి సదస్సు కడపలో ఏప్రిల్ 19న ఆదివారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్‌లో సభ్యత్వం పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు 9505555020 అనే నెంబర్‌కు ఫోన్ చేసి పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

వేదిక : మయూరా గార్డేనియా, నెహ్రూ పార్క్ ఎదురుగా, కో-ఆపరేటివ్ కాలనీ
సమయం : సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు
తేది : ఏప్రిల్ 19, ఆదివారం
ప్రవేశం : ఉచితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement