మీరు సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్‌లో చేరారా?
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వివిధ పొదుపు సాధనాల్లో పెట్టుబడులు చేసేవారికోసం తాను నిర్వహిస్తున్న ‘ఇన్వెస్టర్స్ క్లబ్’లో చేరినవారికి ‘సాక్షి’ మరిన్ని ప్రయోజనాలు అందజేస్తోంది. ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట నిర్వహిస్తున్న సదస్సులకు ఉచితంగా హాజరయ్యే అవకాశం కల్పిస్తున్న సాక్షి... అందులో పాల్గొన్న వారికి ఆ తరవాత కూడా వివిధ సూచనలు అందజేసే బాధ్యతను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు వారందరికీ మార్కెట్ పరిస్థితులను అప్‌డేట్ చేస్తూ న్యూస్‌లెటర్ పంపిస్తోంది.
దీంతో పాటు ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సుల వివరాలు, తేదీల వంటివి కూడా పంపిస్తోంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలాలను పొందాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సేవలకు సంబంధించి మరింత సమాచారానికి 9505555020 నంబర్‌కు ఉద యం 10 సాయంత్రం 6 మధ్య కాల్ చేయొచ్చు. investorsclub @sakshi.com కు ఈ మెయిల్ కూడా పంపవచ్చు.