ధాన్యం మద్దతు ధర పెంచాలి | paddy msp must raise | Sakshi
Sakshi News home page

ధాన్యం మద్దతు ధర పెంచాలి

Published Tue, Nov 1 2016 2:33 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

paddy msp must raise

ఏలూరు(సెంట్రల్‌) : ధాన్యం మద్దతు ధర పెంచాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 4న ఏలూరులో సదస్సు నిర్వహిస్తున్నట్టు కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక అన్నే భన¯ŒSలో సోమవారం  సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం మద్దతు ధర రైతులకు ఏమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.1700కు పైగా ఖర్చు అవుతోందని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1510, రూ.1470ను ధాన్యం మద్దతు ధగా ప్రకటించారని, క్వింటా ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ప్రస్తుత ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయాలని  శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 4న స్థానిక ఐఏడీపీ హాలులో ఉదయం 11గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని,   రైతు సంఘాల రాష్ట్ర,  జిల్లా నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో  సంఘం నాయకులు గంజి నాగేశ్వరరావు, గొర్రెల సాంబశివరావు, వాడపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement