జిల్లా సదస్సును జయప్రదం చేయాలి | to succesful distict seminar in padmashaii | Sakshi
Sakshi News home page

జిల్లా సదస్సును జయప్రదం చేయాలి

Published Sat, Aug 27 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

to succesful distict seminar in padmashaii

నల్లగొండ టూటౌన్‌ : జిల్లా కేంద్రంలోని ఎస్పీటీ మార్కెట్‌లో ఈనెల 28న నిర్వహించనున్న పద్మశాలి యువజన సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మశాలీల ఐక్యతకు, రాజకీయ చైతన్యం కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పద్మశాలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాస్, పున్న పాండు, కర్నాటి నీలయ్య, లక్ష్మీనారాయణ, మత్య్సగిరి, ధనుంజయ్‌ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement