ఎస్‌ఎంసీల పాత్ర కీలకం
- జడ్జి ఎంఏ సోమశేఖర్
- ఎస్‌ఎంసీలపై జాతీయ సదస్సు
కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం అమలులో స్కూల్ మేనెజ్‌మెంట్ కమిటీలది కీలక పాత్ర అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఏ. సోమశేఖర్ అన్నారు. స్థానిక మథర్ థెరిస్సా ఎక్స్‌లెంట్ ఇన్ టీచర్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్‌లో మంగళవారం తేజ రూరల్ డెవలప్‌మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎంసీలపై రెండు రోజుల జాతీయ శిక్షణ, జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఎస్‌ఎంసీలు చేపట్టే పనులు అభినందనీయమన్నారు. 6-14 సంవత్సరాల వయసున్న బాలబాలికలు బడి బయట ఉండరాదన్నారు. అనంతరం ఎస్‌ఎస్‌ఏ డైరెక్టర్ ఆంజనేయులు, హుసేన్, జనార్ధన్‌గౌడు, సైకాలజిస్టు పెద్దగారి లక్ష్మన్న, సిల్వర్ జూబ్లీ కాలేజీ అధ్యాపకులు డా.ఎస్ జహాన్, రిసోర్స్ పర్సన్ ఏవీ రమణయ్య, ఉస్మానియా కాలేజీ అధ్యాపకులు గౌస్, స్వచ్చంధ సంస్థ సభ్యులు బాబురావు, వెంకటేశ్వర్లు, సర్దార్ బాషా, మేఘన తదితరులు పాల్గొన్నారు