smc
-
స్కూల్ కమిటీ ఎన్నికల్లో మళ్లీ కూటమి కుట్ర
సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ/కొనకనమిట్ల: ప్రశాంతంగా జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు టీడీపీతోపాటు కూటమి నాయకులు రాజకీయరంగు పులిమారు. ఈ నెల 8వ తేదీన 40,150 పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ రోజు 631 స్కూళ్లలో గ్రామస్థాయి కూటమి నాయకులు గొడవలకు దిగారు. దీంతో కోరం లేక 631 స్కూళ్లలో ఎన్నికలు నిలిచిపోయాయి. ఆ ఎన్నికల్ని విద్యాశాఖ అధికారులు శనివారం నిర్వహించగా.. కూటమి నేతలు మళ్లీ పాత పరిస్థితినే తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిన తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ మద్దతుదారులన్న నెపంతో మళ్లీ ఎన్నికలు నిలిపేసేందుకు యత్నించారు. పలుచోట్ల దళిత తల్లిదండ్రులపై దాడులు చేశారు. కొన్నిచోట్ల తమకు బలం లేదన్న అక్కసుతో ఎన్నికల్ని నిలిపేయించారు. టీడీపీ నాయకుల అరాచకాలతో కొన్నిచోట్ల పేరెంట్స్ తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నాయకుల కుట్రలకు కొన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు సైతం వత్తాసు పలకడం గమనార్హం. మొత్తంమీద టీడీపీ నేతల కుట్రలతో 282 పాఠశాలల్లో కమిటీ ఎన్నికలు నిలిచిపోయాయి. దళితులపై దౌర్జన్యం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గొల్లకందుకూరు పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలను టీడీపీ నేతలు మరోసారి వాయిదా వేయించారు. ఇక్కడ వైఎస్సార్సీపీ వర్గానికి 15 ఓట్లు ఉండగా, టీడీపీ వర్గానికి 6 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయంతో టీడీపీ నేతలు స్థానిక దళితులైన ఇద్దరు పేరెంట్స్‌ను భయభ్రాంతుల్ని చేశారు. దళితుడైన నారాయణ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తుండటంతో దాడిచేశారు. ఎన్నికల్లో పాల్గొంటే అంతు చూస్తామని బెదిరించారు. మరో దళితుడు వెంకటరమణయ్యను రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంఈవో ఎన్నికలను మరోసారి వాయిదా వేశారు. టీడీపీ వర్గీయుల అరాచకాలను నిరసిస్తూ 13 మంది పేరెంట్స్ తమ పిల్లలను మరో పాఠశాలలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని కాట్రగుంట పంచాయతీ పేరారెడ్డిపల్లి యూపీ పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్ని ఆపాలని టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోపాటు వైఎస్సార్సీపీ మద్దతుదారులే కమిటీ సభ్యులుగా ఎన్నికవడంతో ఉక్రోషం పట్టలేని టీడీపీ కార్యకర్త కె.బసవయ్య పాఠశాల సభ్యులున్న గదిలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న పేపర్లు చించి బయటవేశాడు. 99.38 శాతం ఎన్నికలు పూర్తి ఎస్పీడీ శ్రీనివాసులు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 99.38 శాతం పాఠశాలల్లో పూర్తయ్యాయని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జీరో ఎన్రోల్మెంట్, పాఠశాలల మూసివేత, కోరం లేకపోవడం వంటి కారణాలతో 282 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. -
వైద్య విద్య... మార్పులు తథ్యం!
దేశంలో వైద్య విద్యలో సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. యూజీ నుంచి పీజీ మెడికల్ కోర్సుల వరకు.. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పరీక్షల వరకు.. కాలేజీలకు అనుమతి మొదలు.. ఫీజులపై అధికారాల వరకు.. పలు మార్పులు జరుగనున్నాయి. ఆ దిశగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుæ–2017కు డిసెంబర్ 15న కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత ఎన్ఎంసీ బిల్లులో ముఖ్యాంశాలు.. ... దేశంలో వైద్య విద్యలో రానున్న మార్పులపై విశ్లేషణ..! ఎంసీఐ రద్దు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు.. నిపుణుల కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లుæ–2017ను రూపొందించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)బిల్లుæ–2017 ప్రకారం– ప్రస్తుతం దేశంలో వైద్య విద్య పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి.. దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ని ఏర్పాటు చేస్తారు. ఎన్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు అటానమస్ బోర్డులు యూజీ, పీజీ మెడికల్ విద్య నిర్వహణ; వైద్య కళాశాలల అసెస్మెంట్, అక్రిడిటేషన్; వైద్య వృత్తి నిపుణుల రిజిస్ట్రేషన్ తదితర బాధ్యతలు నిర్వహిస్తాయి. నాలుగు బోర్డులు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్; పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్; మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్; బోర్డ్ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్. ఇలా.. ప్రత్యేకంగా ఏర్పాటైన నాలుగు బోర్డ్‌ల్లో.. ఒక్కో బోర్డ్ ఒక్కో బాధ్యతను నిర్వహిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు సంబంధించిన బాధ్యతను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్; పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల రిజిస్ట్రేషన్, వృత్తి సంబంధిత ఎథిక్స్ వంటి అంశాలను బోర్డ్ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్ చూస్తుంది. ఎంఏఆర్బీయే కీలకం ఎన్ఎంసీ బిల్లులో పేర్కొన్న నాలుగు బోర్డ్‌లలో.. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ పనితీరే కీలకంగా మారనుంది. కళాశాలల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలు మొదలు మెడికల్ ప్రాక్టీషనర్లకు, మెడికల్ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే వరకు.. అన్ని వ్యవహారాలు ఎంఏఆర్బీయే చూసుకుంటుంది. అంతేకాకుండా ప్రతి ఇన్స్టిట్యూట్కు పనితీరు ఆధారంగా రేటింగ్ ఇచ్చే విధానం కూడా ఎంఏఆర్బీ చేపట్టనుంది. ఈ రేటింగ్ ఆధారంగా విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కాళాశాలను గుర్తించి.. అందులో చేరే వీలుంటుంది. ప్రాక్టీస్‌కు ముందు పరీక్ష నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లు–2017 ప్రకారం–వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ విధానం అమల్లోకి వచ్చింది. అలాగే వైద్య కోర్సులు పూర్తిచేసుకొని.. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేపట్టేందుకు ముందుగా జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ లైసెంటీయేట్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు గ్రాడ్యుయేష¯Œ స్థాయి వైద్య కోర్సుల్లో పొందిన నైపుణ్యాలను పరిశీలించేలా ఈ పరీక్ష జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులు చదివి.. మన దేశంలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలనుకంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఎన్ఎంసీ బిల్లు ప్రకారం– ఇక నుంచి మన దేశంలోని కాలేజీల్లో వైద్య విద్యలో చేరిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత నేషనల్ లైసెంటీయేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రైవేటు ఫీజులపై స్వేచ్ఛ ఎన్ఎంసీ బిల్లుæ 2017 ప్రకారం– ప్రయివేట్ వైద్య కళాశాలలు మొత్తం సీట్లలో 60శాతం సీట్లకు సంబంధించి ఫీజును నిర్ణయించుకునే అధికారం ఆయా కళాశాలల యాజమాన్యాలకు లభిస్తుంది. మిగతా.. 40శాతం సీట్లకు ఫీజును మాత్రం ఎన్ఎంసీ నిర్దేశిస్తుంది. ఎన్ఎంసీ నిర్దేశించిన ఫీజుకంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే... భారీ జరిమానా విధించే ఆస్కారముంది. ఏటా అనుమతులకు స్వస్తి ప్రస్తుతం ఎంసీఐ నిబంధనల ప్రకారం– కళాశాలలు సీట్లు పెంచుకోవాలన్నా.. కొత్తగా కోర్సులు ప్రవేశ పెట్టాలన్నా.. ప్రతిఏటా ఎంసీఐకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అనుగుణంగా ఎంసీఐ నేతృత్వంలోని నిపుణుల బృందాలు ఆయా కళాశాలల్లో ప్రత్యక్ష తనిఖీలు చేసి.. అనుమతులు మంజూరు చేస్తాయి. ఎన్ఎంసీ బిల్లుæ ప్రకారం.. ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు. ఇక కళాశాలల ఏర్పాటుకు, గుర్తింపునకు దరఖాస్తు ఒకసారి చేసుకుంటే సరిపోతోంది. ప్రతిఏటా అనుమతుల పునరుద్ధరణ కోసం, సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంసీఐ.. అనుమతుల పునరుద్ధరణ, సీట్ల పెంపు పేరుతో ప్రతిఏటా తనిఖీలు చేయడం.. ఆ క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బిల్లులో తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణకు సలహా మండలి ఎన్ఎంసీకి సమాంతరంగా రెండు స్వతంత్ర సలహా మండళ్లు పనిచేస్తాయి. ఐదు మంది సభ్యులతో సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ; 64 మంది సభ్యులు కలిగిన మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ ఎన్ఎంసీలో ఖాళీల భర్తీ ప్రక్రియను చూస్తుంది. మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఎన్ఎంసీ సభ్యులతోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధులు ఉంటారు. ఎన్ఎంసీ సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ వైద్య రంగంలో వస్తున్న నిరంతర మార్పులు, దానికి అనుగుణంగా అకడమిక్‌గా విద్యార్థు లకు కొత్త నైపుణ్యాలు అందించే క్రమంలో సిలబస్, కరిక్యులంలో ఎప్పటికప్పుడు చేయాల్సిన మార్పులకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. ఎన్ఎంసీ ముఖ్యాంశాలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రద్దు ప్రత్యేకంగా నాలుగు అటానమస్ బోర్డ్‌ల ఏర్పాటు ఇన్స్టిట్యూట్లు, కోర్సుల మూల్యాంకనకు ఎంఏఆర్బీ ప్రైవేటు కళాశాలల్లో 40 శాతం సీట్లకు ఫీజు నిర్ణయించే అధికారం కరిక్యులంలో మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాల కోసం మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్. మేలు చేసే అంశమే ఎన్ఎంసీ బిల్లులోని అంశాలు విద్యార్థులకు మేలు చేసే విధంగానే ఉన్నాయి. అయితే ప్రైవేటు కళాశాలలకు ఫీజుల విషయంలో 60 శాతం సీట్లకు స్వేచ్ఛ ఇవ్వడం అనే విషయాన్ని పునరాలోచించాలి. ఇక.. ఆయా బోర్డ్‌ల పరిధిలో మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌తోపాటు అనుబంధ రంగాల నిపుణులు కూడా ఉండేట్లు చేస్తే సదరు బోర్డ్‌ల పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది. – డాక్టర్.కె.శ్రీనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ -
ఎస్‌ఎంసీల పాత్ర కీలకం
- జడ్జి ఎంఏ సోమశేఖర్ - ఎస్‌ఎంసీలపై జాతీయ సదస్సు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం అమలులో స్కూల్ మేనెజ్మెంట్ కమిటీలది కీలక పాత్ర అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఏ. సోమశేఖర్ అన్నారు. స్థానిక మథర్ థెరిస్సా ఎక్స్లెంట్ ఇన్ టీచర్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్లో మంగళవారం తేజ రూరల్ డెవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎంసీలపై రెండు రోజుల జాతీయ శిక్షణ, జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఎస్ఎంసీలు చేపట్టే పనులు అభినందనీయమన్నారు. 6-14 సంవత్సరాల వయసున్న బాలబాలికలు బడి బయట ఉండరాదన్నారు. అనంతరం ఎస్ఎస్ఏ డైరెక్టర్ ఆంజనేయులు, హుసేన్, జనార్ధన్‌గౌడు, సైకాలజిస్టు పెద్దగారి లక్ష్మన్న, సిల్వర్ జూబ్లీ కాలేజీ అధ్యాపకులు డా.ఎస్ జహాన్, రిసోర్స్ పర్సన్ ఏవీ రమణయ్య, ఉస్మానియా కాలేజీ అధ్యాపకులు గౌస్, స్వచ్చంధ సంస్థ సభ్యులు బాబురావు, వెంకటేశ్వర్లు, సర్దార్ బాషా, మేఘన తదితరులు పాల్గొన్నారు -
తమ్ముళ్ల తన్నులాట
– ఎస్ఎంసీ ఎన్నికల్లో గొడవ –రామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వర్గీయుల బాహాబాహీ –ఎన్నికలు వాయిదా మంత్రాలయం రూరల్: పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికల్లో తెలుగు తమ్మళ్లు తన్నుకున్నారు. బాహాబాహీకి దిగి మరోమారు విభేదాలను బయటపెట్టుకున్నారు. తమ్ముళ్ల తన్నులాటతో మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలూ వాయిదా పడ్డాయి. మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గతంలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం తిరిగి కమిటీ ఎన్నిక జరిపారు. ఉదయాన్నే టీడీపీ సీనియర్ నేత రామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి వర్గీయులు గుంపులుగా పాఠశాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలోకి అనుమతించారు. ఎన్నికల అధికారి జగదీష్ ఆధ్వర్యంలో 6వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఏడో తరగతి విద్యార్థి తల్లితండ్రుల వివరాలను సేకరించే సమయంలో రాజశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఐ నాగేశ్వర రావు, ఎస్ఐ సునీల్‌కుమార్ ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు. -
త్వర‘బడి’తేనే ప్రగతి
పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలదే ‘గురు’తర బాధ్యత పీడిస్తున్న నిధుల కొరత జలుమూరు: పాఠశాల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీలు)ల బాధ్యత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన వివిధ నిధులు ఇక వీరి అనుమతిలేనిదే రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలుపడదు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కమిటీలు త్వరబడితేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఈ నేపథ్యంలో ఆయా సంఘాలు విధులు, బాధ్యతలపై ప్రత్యేక కథనం. కమిటీలకు శిక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కమిటీ సభ్యులు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాకాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విధులు చేపట్టిన పాఠశాల కమిటీలకు చెందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సంఘ సభ్యులకు సంఘాల బాధ్యతలు, విధులు, ఇతరత్రా అంశాలపై తెలియజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్రణాళిక సిద్ధం పాఠశాల అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. జిల్లా వ్యాప్తంగా 3,308 సంఘాలకు గాను 3,160పాఠశాలల్లో కొత్త సంఘాలు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక వసతులు, భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ లేనివి తదితర వాటిపై కమిటీలు దృష్టి పెట్టవలసి ఉంటుంది. పనితీరుపై పర్యవేక్షణ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయలపనితీరు, విద్యార్థుల ప్రగతిపై కమిటీలు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాల్సిందే. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవి చంద్ర తన దత్తత గ్రామమైన సైరిగాం అభివృద్ధిపై స్వయంగా జలుమూరు మండల అధికారులుతో సమీక్షించి గ్రామంలో ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలలో చదవకూడదని, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని సూచించారు. దీనికి కావలిన పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మండల విద్యాశాఖధికారి గైర్హాజరయ్యారు. అలాగే మరుసటి రోజు ఉదయం తనే స్వయంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థుల చదువు,ప్రగతిపై అడిగేందుకు పాఠశాలకు వెళ్లగా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీనిపై సంబంధిత విద్యాధికారులు వీరికి శాఖపరంగా మెమోలు ఇచ్చారు. అలాగే, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి బలివాడ దయానిది ఎంత మంది ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటున్నారో తెలుసుకునేందుకు బస్‌లో రాకపోకలు చేస్తున్న ఉపాధ్యాయుల నివేదిక తయారు చేశారు. విధులు, బాధ్యతలు ఉన్నా నిధుల మాటేంటి విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ పాఠశాల సామాజిక భాగస్వామ్యం కింద ఎస్‌ఎంసీలదే బాధ్యత. ఏటా ప్రాథమిక పాఠశాలకు పదివేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.22 వేలు సదుపాయలు, నిర్వహణ కింద విడుదల చేస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 2,269 ప్రాథమిక పాఠశాలలుకు రూ.226 కోట్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.12.51 కోట్లు విడుదలవుతాయి. ఈ నిధులు సద్వినియోగం అయ్యేలా కమిటీలు చూడాలి. ఈ ఏడాది కనీసం సుద్దముక్కలు కొనేందుకు కూడా రూపాయి లేదని, మరి ఎలా అభివృద్ధి జరుగుతుందని ఆయా పాఠశాల కమిటీలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది పాఠశాల నిర్వహణ నిధులు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కొత్తగా నిధులు వచ్చే పరిస్థితి కనబడం లేదు. చదువులో ప్రగతి, సక్రమంగా భోజన పథకం నిర్వహణపై దృష్టి ఎస్ఎంసీలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రగతిని పరిశీలించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా సీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను ఆయా పాఠశాల సముదాయాల్లో గత వేసవిలో శిక్షణ ఇచ్చారు. ఇందులో సీ గ్రేడ్‌లో ఉన్నవారికి బీ గ్రేడ్‌కు బీ గ్రేడ్‌లో ఉన్న వారికి ఏ గ్రేడ్‌లోకి మార్చాలి. చాలా మంది ఇందులో వెనుకబడిపోయారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అతి ప్రధాన బాధ్యత మధ్యాహ్నభోజన పథకం అమలు. జిల్లా వ్యాప్తంగా 3,310 పాఠశాలల్లో 3,44,354 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇందులో మధ్యాహ్న భోజన పథకం కింద 3,29,620 మంది లబ్ధిపొందుతున్నారు. దీనికి నెలకు సుమారు సుమారు రూ.7.2 కోట్లు ఖర్చవుతోంది. విద్యాశాఖ ఇచ్చిన మెనూ ప్రకారం ఆయా ఏజెన్సీలు నాణ్యమైన భోజనం విద్యార్థులకు వండి పెట్టాల్సిందే. కానీ వీటి అమలు ఎక్కడా సక్రమంగా జరగలేదు. అలాగే, గత ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు 2,570 మందిని నియమించగా, వారికి వేతనాల కింద రూ.1.24 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది వేతనాలు లేక పోవడంతో చాలా మంది చోట్ల మరుగుదొడ్ల నిర్వహణ మానేశారు. ఎస్‌ఎంసీలతో అభివృద్ధి పాఠశాల యాజమాన్య కమిటీలతో అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఎన్నికైన సంఘాలు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. అలాగే ఎస్ఎంసీలు భాగస్వామ్యంతోపాటు మా పర్యవేక్షణ ఉంటుంది. – ఎ.సుబ్బారావు, జిల్లా ఉప విద్యాశాఖధికారి. -
ఎస్ఎంసీ చైర్మన్‌పై దాడి
రాజోలు(కురవి) : రాజోలు జెడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ బానోత్ అర్జున్‌పై ఆదివారం పలువురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు. బాధితుడు అర్జున్ కథనం ప్రకారం.. బాలు తండాకు చెందిన బానోత్ అర్జున్ ఇటీవల రాజోలు హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగా, అదే తండాకు చెందిన మాలోత్ రమేష్, మాలోత్ వీరన్న, సురేష్, భద్రు, ధరావత్ సుందర్‌లు తండా శివారులో కాపు కాసి అర్జున్‌పై దాడికి పాల్పడ్డారు. దీం తో ఆయన తలకు గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. అనంతరం అర్జున్ను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన పై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జెండా ఎగురవేసేది ఎస్‌ఎంసీలే!
అగనంపూడి : మహా విశాఖ పరిధిలో పంద్రాగస్టుకు మూడు రంగుల జెండా ఎగురవేసే అదష్టం పాఠశాల యాజమాన్యం కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్లకు దక్కింది. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్పొరేటర్లు అందుబాటులో లేరు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, పాథమికోన్నత పాఠశాలల్లో ఎంపీటీసీలు, ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీలు పతాకావిష్కరణ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే పాలక మండళ్లులేని జీవీఎంసీలో పతాకావిష్కరణ ఎవరు చేయాలనే విషయమై స్పష్టత లేకపోవడంతో స్పందించిన మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డికి ఆదేశాలిచ్చారు. ఈమేరకు జీవీఎంసీ పరిధిలోని పెందుర్తి, చినగదిలి, భీమిలి, ఆనందపురం, పరవాడ, పెదగంట్యాడ, సబ్బవరం, అనకాపల్లి మండలాల పరిధిలోని జీవీఎంసీ విలీన ప్రాంతాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకే ఆ హోదా దక్కింది. -
రెండో విడత 136 ఎస్‌ఎంసీల ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ) : మొదటి విడతలో వాయిదా పడిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు సంబంధించి రెండో విడత నిర్వహించిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 136 కమిటీలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఇంటి వెంకట్రావు శనివారం తెలిపారు. రెండో విడతలో 30 కమిటీల ఎన్నికలు వివిధ కారణాలతో మరోసారి వాయిదా పడ్డాయని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
అధికార దాహం!
ఎస్ఎంసీ ఎన్నికల్లో తమ్ముళ్ల పోటాపోటీ – బరిలో కొత్త, పాత నాయకుల అనుచరులు – మెజార్టీ ఎస్‌ఎంసీల ఎన్నికలు ఏకగ్రీవం – కోరం లేక కొన్ని చోట్ల వాయిదా – నంద్యాల, ఆళ్లగడ్డల్లో భూమా, శిల్పా, గంగుల వర్గీయుల మధ్య పోటీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. అధికార పార్టీలోని కొత్త, పాత నేతల అనుచరులు ఆయా స్థానాలకు పోటీపడ్డారు. పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడగా.. మరికొన్ని చోట్ల కోరం లేక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిలిచిపోయాయి. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా నాగిరెడ్డి, గంగల ప్రతాపరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద చెదురుముదురు ఘటనలు మినాహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్ఎస్ఏ అధికారి విజయకష్ణారెడ్డి తెలిపారు. ఉదయం ఏడు నుంచే ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా 2,931 పాఠశాలల ఎస్ఎంఎసీలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక, 1.30 నుంచి 2 గంటల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టారు. అయితే మెజార్టీ పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చాలా స్థానాల్లో సభ్యుల ఎన్నిక నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు సోమవారం విద్యాసంస్థల బంద్ ఉన్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ఉద్రిక్తత నంద్యాల నియోజకవర్గంలోని వెంకటాపురం పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆహోబిళంలోనూ ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి వర్గీయులు గొడవకు దిగడంతో ఎన్నికను వాయిదా వేశారు. రుద్రవరం మండలంలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయకులు పోటాపోటీగా తలపడడంతో ఇక్కడ పది కమిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఎన్నిక పోటాపోటీగా సాగింది. ఇక్కడ విష్ణువర్దన్‌రెడ్డి వర్గం పైచేయి సాధించింది. – ఆలూరు నియోజకవర్గం మొలగవల్లిలోని మూడు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. – మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని గంగులపాడులో ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. – పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో ఆరు, గడివేములలో 4, పాణ్యంలో రెండు పాఠశాలల ఎన్నికలు వాయిదా పడ్డాయి. – గడివేముల మండల బూజనూరు, కె.బొల్లవరం ఎస్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. – నంద్యాలలోని చాబోలు, కలివిసిద్ధి ఎయిడెడ్ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడి యాజమాన్య కమిటీలు ఒప్పుకోలేదు. – పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెల్దుర్తి బాలికల ఉన్నత పాఠశాల, కొట్టాలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. – ఆత్మకూరు నియోజకవర్గంలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ ఎనిమిది పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. – బనగానిపల్లె నియోజకవర్గంలో 17 పాఠశాలల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తం ఎస్ఎంసీలు : 2,931 ఫలితాలు ప్రకటించిన స్థానాలు : 13,345(సభ్యులు) ఉద్రిక్తత, కోరం లేక వాయిదా పడిన స్థానాలు : 212 ( రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు 29 మండలాల ఎస్‌ఎంసీల ఫలితాలు వెలువడినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ) -
ఎస్ఎంసీ ఎన్నికలను సజావుగా జరపాలి
జిల్లా అదనపు జేసీ తిరుపతిరావు విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల ఎన్నికలను సజావుగా జరపాలని జిల్లా అదనపు జేసీ, సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఇన్చార్జి ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఎంఈఓలను కోరారు. మంగళవారం హన్మకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవోలకు, స్ట్రాంగ్ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీలోపు ఎస్‌ఎంసీల ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి పాఠశాల నిర్వహణ చూసుకునేందుకు గాను పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల పటిష్టపరిచేలా చూడాలన్నారు. ఎంఈవోలు, హెచ్ఎంలు, పాఠశాలల తల్లిదండ్రులు అందరూ భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సభ్యులలో సామాజిక వర్గాల వారిగా ప్రాతిని««దl్యం ఉండాలన్నారు. హెచ్ఎంలు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు 50 శాతం పాల్గొనేలా చూడాలని, లేకపోతే రద్దు చేయాలన్నారు. డీఈఓ పి.రాజీవ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో ఎస్ఎంసీ కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు వేణుఆనంద్, టి.శ్రీలత, ఎం.శ్రీదేవి, సంధ్యరాణి, రిసోర్స్ పర్సన్లు సీహెచ్.నాగేశ్వర్రావు, డి.వేణుగోపాల్ పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. -
ఆగస్టు 1న ఎస్ఎంసీ ఎన్నికలు
ఆత్మకూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ (పాఠశాలల యాజమాన్య కమిటీ) ఎన్నికలు ఆగస్ట్ 1వ తేదీన జరగనున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభించాల్సి ఉండగా వాయిదా వేశారు. తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలను వచ్చే నెల 1న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. 3 గంటలకు ప్రమాణస్వీకారం, 4 గంటలకు తొలి సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు. కాగా ప్రక్రియ ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు నోటిఫికేషన్ విడుదల, మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 29న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికలను నిర్వహించనున్నారు. -
ఎస్ఎంసీలకు ఎన్నికలు ఎన్నడు?
రాయవరం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధిలో ప్రజ ల భాగస్వామ్యం ఉండాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల పదవీకాలం ముగిసి నెల రోజులపైనే గడిచింది. తిరిగి కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఇప్పట్లో ఈ కమిటీలకు ఎన్నికలు నిర్వహించి బలోపేతం చేస్తారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. టీడీపీ హయాంలోనే 14 ఏళ్ల క్రితం విద్యా కమిటీల పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. తదనంతరం విద్యాకమిటీల పేరును పాఠశాల యాజమాన్య కమిటీలుగా మార్పు చేశారు. ఈ కమిటీలు పాఠశాల నిర్వహణకు దోహదపడాలన్నది ప్రభుత్వ ఆశయం. చివరిసారి ఎన్నికైన కమిటీల పదవీ కాలం గత జూన్ 29తో ముగిసింది. అప్పటి నంచి ఎస్ఎంసీలకు ఎంఈఓలే చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ కె.సంధ్యారాణి ఆదేశాలు విడుదల చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంత వరకు విద్యాశాఖ అటు వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో పాఠశాలలను గాలికొదిలేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎస్ఎంసీలు ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందనే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది. 4,217 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 2013 జూన్ 29న ఎస్ఎంసీలను ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలలో ఒక్కో తరగతి నుంచి ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేసి తిరిగి వారి నుంచి చైర్మన్‌ను, వైస్ చైర్మన్‌ను చేతులెత్తి ఆమోదించే విధానంలో ఎంపిక చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటయ్యే ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌కు ప్రధానోపాధ్యాయులతో కలసి చెక్ పవర్‌ను కల్పించారు. ఎస్‌ఎంసీల పదవీకాలం ముగిసిన తర్వాత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, పాఠశాల హెచ్ఎం సభ్యులుగా, ఎంఈవో చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాఠశాల నిధులను హెచ్ఎం, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ కలిసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అజమాయిషీ మాత్రం ఎంఈవో చేస్తారు. ఎస్‌ఎంసీల బాధ్యతలివీ.. యాజమాన్య కమిటీలకు పాఠశాల నిర్వహణలో కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. పాఠశాలకు మంజూరయ్యే పలు రకాల అభివృద్ధి నిధుల ఖర్చు వీటి పర్యవేక్షణలోనే జరగాలి. నూతన భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను ఇవి నిర్వహిస్తాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల స్థాయిలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యార్థులు శతశాతం హాజరయ్యే విధంగా చూడాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందేలా చూడడం క మిటీల ప్రధాన బాధ్యత. విద్యార్థులు మధ్యలో బడి మానకుండా చూడడం, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం, పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం, ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం నుంచి అందే నిధులను సక్రమంగా వినియోగించేలా చూడడం కమిటీల బాధ్యతే. పాఠశాలల్లో మౌలిక సదుపాయూల కల్పన, పర్యవేక్షణ, విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్రపై పర్యవేక్షణ కూడా ఈ కమిటీల పరిధిలో ఉంది. మొత్తం మీద పాఠశాల నిర్వహణపై పూర్తి బాధ్యతలు ఎస్ఎంసీలకు ఉంటాయి. రెండు నెలలకోసారి పాఠశాల యాజమాన్య కమిటీలు సమావేశమవ్వాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు తమకు చూపమని ఉపాధ్యాయులను అడిగే అధికారం యాజమాన్య కమిటీ సభ్యులకు ఉంటుంది. ఉత్తర్వులు రాలేదు.. పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం పూర్తయ్యాక ఎంఈవోలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తిరిగి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. - పట్నాల ముక్తేశ్వరరావు, ఎంఈవో, రాయవరం -
‘గదుల’పై గద్దలు
‘మా కార్యకర్తలు చెప్పింది వినండి. వారు చెయ్యమన్న పనులు చేసిపెట్టండి. వారిని చూసుకుంటేనే మా సర్కార్‌ను మరోసారి చూస్తాం. లేదంటే మీకూ ఇబ్బందే.. మాకూ ఇబ్బందే’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్లతో అన్న మాటలివి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నా ఆ రోజు నుంచీ జిల్లాలో తెలుగుదేశం నేతలు అన్ని పనుల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. దక్కినంత సొమ్ము దండుకుంటున్నారు. - ఎస్ఎంసీలు చేపట్టాల్సిన అదనపు గదుల నిర్మాణం - కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న టీడీపీ నాయకులు - జిల్లావ్యాప్తంగా 10 నుంచి 15 శాతం కమీషన్ వసూలు - కొన్నిచోట్ల వాటాలు కుదరకపోవడంతో పనుల్లో జాప్యం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘తమను చూసుకోమని’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలను తెలుగుదేశం కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడానికి లెసైన్సుగా పరిగణించి అన్ని వ్యవహారాల్లో ‘సొంత లాభానికే’ ఆరాటపడుతున్నారు. అది, ఇది అని లేకుండా.. చివరకు విద్యార్థుల కోసం చేపట్టే అదనపు గదుల నిర్మాణంపైనా రాంబదుల్లా వాటి కమీషన్ల కోసం పీక్కుతింటున్నారు. అడిగే నాథుడు లేడన్న బరి తెగింపుతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లను కాగితాలకే పరిమితం చేస్తున్నారు. జిల్లాలో మూడొంతుల నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల 10 శాతం ముట్టజెప్పేలా ఒప్పందాలు జరుగుతుంటే నోరున్న నేతలున్న ప్రాంతాల్లో 15 శాతం కూడా దండుకుంటున్నారు. కమీషన్లపై నేతల మధ్య పేచీలతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న పరిస్థితి కూడా జిల్లాలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో అదనపు గదులను మార్చి నెలాఖరుకు ఎలా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో జిల్లాలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థుల కోసం 927, ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం 184తో కలిపి జిల్లా వ్యాప్తంగా 1111 గదుల నిర్మాణానికి అనుమతి లభించింది. ఈ గదుల నిర్మాణం కోసం జిల్లాకు రూ.58.63 కోట్లు కేటాయించారు. ఒక గదికి గతంలో రూ.3.60 లక్షలు కేటాయించగా ఇప్పుడా మొత్తాన్ని మరో రూ.2.20 లక్షలు పెంచారు.ఆ పెంపుదలే అధికారపార్టీ నేతలకు వరంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో పాఠశాలమేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనేది నిబంధన. నిర్మాణాన్ని కమిటీలకు అప్పగిస్తే నాణ్యత బాగుంటుందన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఎక్కువ కమీషన్ ఇచ్చిన వారికే.. అయితే ఈ వ్యహారమంతా నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బాహాటంగా జరుగుతుండటంతో పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి పరిశీలనలకే పరిమితమవుతున్నారు. నేతలు కమిటీలను గుప్పిట్లో పెట్టుకుని నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ముందే 10 నుంచి 15 శాతం కమీషన్ మూటగట్టుకుంటున్నారు. ఉదాహరణకు ముమ్మిడివరం నియోజకవర్గం.. తాళ్లరేవు, ఐ. పోలవరం మండలాల్లో నిర్మాణ పనులు మండల స్థాయి నేతలు చెప్పిన వారికే కట్టబెట్టాలని ముఖ్యనేత హుకుం జారీచేశారు. అక్కడ 10 శాతం కమీషన్ ఇస్తామన్న కాంట్రాక్టర్‌ను 15 శాతం కోసం డిమాండ్ చేస్తుండటంతో నేతల మధ్య వివాదం తలెత్తింది. ఆ కమీషన్ ముందుగానే ముట్టచెపితేనే పనులు అప్పగిస్తామంటుండటంతో కాంట్రాక్టర్లు వెనకడుగు వే స్తున్నారని సమాచారం. తాళ్లరేవు మండలంలో 30 అదనపు గదుల నిర్మాణానికి కేవ లం సుంకరపాలెం, ఇంజరం, గాడిమొగల్లో పనులు కిటికీల వరకే వచ్చాయి. మిగిలిన వాటిసై కాంట్రాక్టర్లతో ఒప్పం దాలు ఇప్పుడిప్పుడే కొలిక్కివస్తున్నా యి. ఐ.పోలవ రం మండలంలో అన్ని గదుల నిర్మాణం కాంట్రాక్టర్లకే ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. రాజోలులో ముఖ్యనేతదే మేత.. రాజోలు నియోజకవర్గంలో ముఖ్యనేతే స్వయంగా 15 శాతం కమీషన్క ఒప్పందాలు చేసుకుంటుండడం తో పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు గుర్రుగా ఉన్నా రు. అధినేత కార్యకర్తలను, తమ వంటి నేతలను చూడమంటే ఇక్కడ మాత్రం ఎన్నికల్లో అప్పుల పాలైపోయామంటూ పెద్ద తలకాయలే కమీషన్లు ఎగరేసుకుపోతున్నారని మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అదనపు గదుల నిర్మాణంలో కమీషన్‌ను మూడు వాటాలు వేసుకున్నారని సమాచారం. నేతలకు 10 శాతం, పనులు దక్కించుకున్నకాంట్రాక్టర్కు సబ్‌కాంట్రాక్టర్ ఇచ్చే 5 శాతం, క్షేత్రస్థాయిలో సిబ్బందికి 5 శాతం ఇచ్చేలా జరిగాయంటున్నారు. కమీషన్ల ఖరారులో జా ప్యం తో ఇంతవరకు కేవలం 300 గదులనే మొదలు పెట్టా రు. నిర్మాణాల్లో జాప్యంపై శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఎస్ఎంసీలు ముందుకు రాకుంటే టెండర్లు పిలవాలని కలెక్టర్ ఆదేశించడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ పనులన్నీ ఎస్ఎం సీ లే చేపడుతున్నట్టు జిల్లా యంత్రాంగం భావిస్తున్న ట్టు కనిపిస్తోంది. టీడీపీ నేతల నిర్వాకం వల్ల భావి పౌరులు చదువుకునే భవనాల నాణ్యత ప్రశ్నార్థకం కానుంది. దీనికి ఉన్నతాధికారులు చెక్ చెప్పాలి. వారి దండుడు వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. మేనేజ్మెంట్ కమిటీలే చేపట్టాలి.. నిబంధనల మేరకు పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, హెచ్‌ఎమ్‌ల పర్యవేక్షణలో చేపట్టాలి. ఎక్కడైనా కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు మా దృష్టికి వస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. - ఎం.శ్రీనివాసరావు, ప్రాజెక్టు అధికారి, రాజీవ్ విద్యామిషన్, కాకినాడ -
దండుకుంటున్న ‘పచ్చ’దండు
సాక్షి, కాకినాడ :అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న సర్వశిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులకు ఇప్పుడు తెలుగుతమ్ముళ్లు తోడయ్యారు. అదనపు తరగతి గుదల నిర్మాణాన్ని అడ్డదారుల్లో చేజిక్కించుకుంటున్న ‘పచ్చ’ దళం పని ప్రారంభించకుండానే పర్సంటేజ్‌లు పంచుకుతినడంతో జిల్లాలో ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది.రాజీవ్ విద్యామిషన్ ద్వారా 2014-15లో జిల్లాలో 927 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని తొలుత ప్రతిపాదించగా, మరో 184 గదులు నిర్మించాలని తర్వాత ప్రతిపాదించారు. ఒక్కో గదికి రూ.4.85 లక్షల అంచనా వ్యయంతో కలెక్టర్ పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చారు. రూ.53.88 కోట్లతో 1,111 తరగతిగదులు నిర్మించాలని సంకల్పించారు. సాధారణంగా ఈ పనులన్నీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఆధ్వర్యంలోనే జరగాలి. కమిటీ చైర్మన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఉమ్మడి ఖాతాలో జమయ్యే ఈ నిధులను కమిటీ పర్యవేక్షణలో ఖర్చు చేయాలి. సాధారణంగా మంజూరైన మొత్తంలో 70 శాతం ముందుగానే వీరి ఖాతాకు జమవుతాయి. నిర్మాణ సామగ్రికి చెక్కులుగా, కూలీలకు మాత్రం నగదు రూపంలో చెల్లింపులు జరగాలి. కానీ అలా జరగడం లేదు. టీడీపీ నేతలకు కలిసొచ్చిన ‘కోడ్’ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి, ఆవురావురుమంటున్న తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి తరగతి గదుల నిర్మాణాన్ని తమ ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు ఎస్‌ఎంసీల మాటున పనులు చేజిక్కించుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లో పరిపాలనామోదం లభించినా ఎన్నికల కోడ్ తొలగే వరకు ఈ పనుల జోలికి వెళ్లలేదు. అదే ‘దేశం’ నేతలకు కలిసివచ్చింది. కోడ్ ఎత్తి వేయగానే పగ్గాలు చేపట్టకుండానే పనులు దక్కించుకున్నారు. గతంలో 70 శాతం పనులు ఎస్‌ఎంసీల ద్వారా, 30 శాతం కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగేవి. కానీ ప్రస్తుతం 20 శాతం పనులు కూడా ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 80 శాతం పనులు ‘పచ్చ’ కాంట్రాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. గదికి రూ.2 లక్షల చొప్పున డ్రా! ఒక్కో గదికి 70 శాతం చొప్పున రూ.3.50 లక్షల మేర ఇప్పటికే ఎస్ఎంసీ ఖాతాలో జమైతే.. పనులు ప్రారంభించకుండానే రూ.2 లక్షల చొప్పున డ్రా చేశారు. ఈ విధంగా 80 శాతం గదులకు సంబంధించి నిధులు డ్రా చేసి, వాటిలో 20 శాతం పర్సంటేజ్‌ల రూపంలో పంచుకుతిన్నారు. కాంట్రాక్టర్‌కు 10 శాతం, కమిటీ చైర్మన్‌కు రెండు శాతం, ఎస్ఎస్ఏ ఉన్నతాధికారుల నుంచి సాంకేతిక సిబ్బంది వరకూ 8 శాతం చొప్పున పంపిణీ జరిగినట్టు సమాచారం. అంటే రూ.53.88 కోట్లలో ఇప్పటికే రూ.37.70 కోట్ల మేర నిధులు ఎస్‌ఎంసీల ఖాతాలకు జమయ్యాయి. అంటే పాతిక కోట్ల వరకు పనులు ప్రారంభించకుండానే డ్రా చేశారన్నమాట. ఈ లెక్కన రూ.6 కోట్ల వరకు పర్సంటేజ్‌ల రూపంలో పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. పాలనామోదం ఇచ్చి ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు కనీసం 400 గదుల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కనీసం 10 శాతం గదులు కూడా పునాది దశ దాటలేదు. కానీ ఖాతాలకు జమైన సొమ్ములు డ్రా చేసి పంచేసుకున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల దన్ను ఉందన్న బరితెగింపుతో పచ్చ కాంట్రాక్టర్లు గదికి రూ.2 లక్షల చొప్పున డ్రా చేసుకోవడంతో ప్రధానోపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. పనులు ప్రారంభిస్తారో లేక డ్రా చేసిన సొమ్ములు స్వాహా చేసి, ఊరుకుంటారో తెలియక వారి కంటి కి కునుకు కరువవుతోంది. ఎమ్మెల్యేలను ఎదిరించలేక, వారి సూచనల మేరకు వారి అనుచరులకు నిధులను డ్రా చేసి ఇచ్చామని, పనులు ప్రారంభించమంటే ‘ఇదిగో చేస్తాం..అదిగో చేస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారని కోనసీమకు చెందిన ఓ హైస్కూల్ ప్రధానో పాధ్యాయుడు ‘సాక్షి’ వద్ద ఆవేనద వ్యక్తం చేశారు. నెలాఖరులోగా ప్రారంభించాలన్న డీఈఓ! ఈ పనుల విషయమై ఆదివారం సమీక్షించిన డీఈఓ శ్రీనివాసులురెడ్డి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన ఈ పనులు ఇంకా ఎందుకు ప్రారంభించ లేదంటూ మండిపడినట్టు సమాచారం. మంజూరైన మొత్తం అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని నెలాఖరు లోగా ప్రారంభించి తీరాలని ఆదేశించినట్టు తెలిసింది. -
ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరం
- రక్షణ లేని ‘చదువు’ - పాఠశాల భవనాలలో సౌకర్యాలు కరువు - దుర్వినియోగమవుతున్న నిధులు - విద్యార్థులకు తప్పని తిప్పలు - నామమాత్రంగా మారిన నిర్వహణ కమిటీలు నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరంగా మారాయి. అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజీవ్ విద్యామిషన్ నుంచి ఏటా కోట్లాది రూపాయలు మంజూరవుతు న్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పులు రావడం లేదు. ఫలితంగా ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్ని మండలం రుద్రూర్ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి చాకలి శ్రీను పాము కాటుతో మృతి చెందడం ఇందుకు నిదర్శనం. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలలు, 465 ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఇందు లో చదువుకుంటున్నారు. వారితోపాటు అక్కడ సమస్యలూ సహవాసం చేస్తున్నాయి. 211 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. మరికొన్ని పాఠశాలలు ఊరికి చివర గా ఉండడంతో, సరైన దారులు లేక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వానాకాలంలో చెట్లు, ముళ్లపొదలు పెరగడంతో పరిసరాలు పమాదకరంగా మారుతు న్నాయి. కాలినడక దారులు కనడబడకుండా పోతున్నాయి. పాఠశాలలలో కనీస సౌకర్యాల కల్పన కోసం రాజీవ్ విద్యా మిషన్ నుంచి కోట్లాది రూపాయలు విడుదలవుతున్నాయి. కానీ, అది సక్రమంగా వినియోగం కావడం లేదు. ప్రజాప్రతినిధుల సహకారంతో, కొందరు కాంట్రాక్టర్లు అవసరం లేని చోట అదనపు గదులు, ప్రహరీలు నిర్మిస్తున్నారు. అవసరం ఉన్న ప్రాంతాలలో ఈ పనులు కొనసాగడం లేదు. జిల్లాలోని 484 పాఠశాలల భవనాలు అసౌకర్యాలకు నిలయంగా ఉన్నాయి. ఎప్పుడో నిర్మిం చినవి కావడంతో దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పులకు రంధ్రాలు, తరగతి గదుల గోడలకు పగుళ్లు ఏర్పడినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం పడితే పరిస్థితి ప్రమాదకరమే. కొన్ని చోట్ల సరిపడినన్ని తరగతి గదులు లేక ఆరుబయటనే విద్యాబోధనను కొనసాగిస్తున్నారు. మూత్రశాలలు నిర్మించి ఉన్న ప్రాంతం లో ముళ్ల పొదలు, చెట్లు ఏపుగా పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. మరి నిధులు ఏమవుతున్నాయి పాఠశాల అభివృద్ధికి సంబంధించి (ఎస్ఎంసీ) పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కమిటీలో 23 మంది, ఉన్నత పాఠశాలల కమిటీలో 17 మంది సభ్యులు ఉంటారు. వీటికి ఏటా పాఠశాల నిధులు రూ. ఏడు వేలు, నిర్వహణ కోసం రూ. ఐదు వేలు, అలాగే 6,7 తరగతులకు మూడు గదుల కం టే ఎక్కువ ఉంటే పది వేల రూపాయలు మంజూరు అవుతాయి. వీటిని పాఠశాల అభివృద్ధికి, వివిధ మరమ్మతులు, పరిశుభ్రతకు వినియోగించాలి, ఎక్కడ కూడా ఈ నిధులకు సక్రమంగా వినియోగించడం లేదు. ఫలితంగా పాఠశాలల పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ముళ్లపొదల మధ్య, బురదనీటితో కునారిల్లుతున్నాయి.