ఆగస్టు 1న ఎస్‌ఎంసీ ఎన్నికలు | smc elections in august | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1న ఎస్‌ఎంసీ ఎన్నికలు

Published Wed, Jul 20 2016 6:07 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

smc elections in august

 
 
 ఆత్మకూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ (పాఠశాలల యాజమాన్య కమిటీ) ఎన్నికలు ఆగస్ట్‌ 1వ తేదీన జరగనున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభించాల్సి ఉండగా వాయిదా వేశారు. తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలను వచ్చే నెల 1న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. 3 గంటలకు ప్రమాణస్వీకారం, 4 గంటలకు తొలి సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు. కాగా ప్రక్రియ ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు నోటిఫికేషన్‌ విడుదల, మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 29న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికలను నిర్వహించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement