- జిల్లా అదనపు జేసీ తిరుపతిరావు
ఎస్‌ఎంసీ ఎన్నికలను సజావుగా జరపాలి
Published Tue, Jul 26 2016 11:56 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలను సజావుగా జరపాలని జిల్లా అదనపు జేసీ, సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఇన్‌చార్జి ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఎంఈఓలను కోరారు.
మంగళవారం హన్మకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవోలకు, స్ట్రాంగ్ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీలోపు ఎస్‌ఎంసీల ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి పాఠశాల నిర్వహణ చూసుకునేందుకు గాను పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల పటిష్టపరిచేలా చూడాలన్నారు. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, పాఠశాలల తల్లిదండ్రులు అందరూ భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సభ్యులలో సామాజిక వర్గాల వారిగా ప్రాతిని««దl్యం ఉండాలన్నారు. హెచ్‌ఎంలు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు 50 శాతం పాల్గొనేలా చూడాలని, లేకపోతే రద్దు చేయాలన్నారు. డీఈఓ పి.రాజీవ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో ఎస్‌ఎంసీ కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు వేణుఆనంద్, టి.శ్రీలత, ఎం.శ్రీదేవి, సంధ్యరాణి, రిసోర్స్ పర్సన్లు సీహెచ్.నాగేశ్వర్‌రావు, డి.వేణుగోపాల్ పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
Advertisement